Vettaiyan | తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ (Rajinikanth) కాంపౌండ్ నుంచి వస్తోన్న తాజా ప్రాజెక్ట్ వెట్టైయాన్ (Vettaiyan). జై భీమ్ ఫేం టీజే జ్ఞానవేళ్ (TJ Gnanavel) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీలో దుషారా విజయన్, రితికా సింగ్ మేల్ లీడ్ రోల్స్ పోషిస్తుండగా.. ఫహద్ ఫాసిల్ (Fahadh Faasil), మంజు వారియర్, రానా దగ్గుబాటి, రావు రమేశ్, రోహిణి మొల్లేటి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ చిత్రం అక్టోబర్ 10న థియేటర్లలో గ్రాండ్‌గా సందడి చేయనుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది టీం. వెట్టైయాన్ ఆడియో, ప్రివ్యూ రేపు విడుదల కానుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. ఎక్జయిట్మెంట్ ముందుంది.. వేట కోసం సిద్దం అంటూ బ్లాక్ గాగుల్స్ పెట్టుకున్న రజినీకాంత్ ఆయుధాన్ని పట్టుకుని గూండాల భరతం పట్టినట్టుగా ఉన్న స్టిల్‌లో తలైవా జేబులో చేయి పెట్టుకొని సూపర్ స్టైలిష్‌గా నడుచుకుంటూ వస్తున్న లుక్ షేర్ చేయగా సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తుంది.
మేకర్స్ ఇప్పటికే లాంచ్ చేసిన వెట్టైయాన్ టైటిల్ టీజర్ సినిమాపై సూపర్ బజ్ క్రియేట్ చేస్తుంది. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ (Lyca Productions) బ్యానర్‌పై సుబాస్కరన్ తెరకెక్కిస్తున్నారు.ఈ మూవీకి మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
Excitement is just around the corner! 🤩 VETTAIYAN 🕶️ Audio and Prevue is releasing TOMORROW. 🏟️ Gear up for the hunt. 💥#Vettaiyan 🕶️ Releasing on 10th October in Tamil, Telugu, Hindi & Kannada!@rajinikanth @SrBachchan @tjgnan @anirudhofficial @LycaProductions #Subaskaran… pic.twitter.com/Z5d8WB8dc5
— Lyca Productions (@LycaProductions) September 19, 2024
Jani Master | పోలీసుల అదుపులో జానీ మాస్టర్.. ఇంతకీ ఎక్కడ పట్టుకున్నారంటే..?
Kanguva | సూర్య కంగువ వచ్చేది అప్పుడే.. కొత్త విడుదల తేదీ ఇదే
RC 16 | టాలీవుడ్లో తొలిసారి.. రాంచరణ్ ఆర్సీ 16 టీంలోకి తంగలాన్ ఆర్టిస్ట్
Vetrimaaran | వెట్రిమారన్ విడుదల పార్ట్ 2 షూట్ టైం.. ఏ సీన్లు చిత్రీకరిస్తున్నారో తెలుసా..?