హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ): గోదావరి పుష్కరాలపై అధ్యయనం నిర్వహించి తగిన నిర్ణయం తీసుకునేందుకు క్యాబినెట్ సబ్‌కమిటీని ఏర్పాటుచేస్తూ గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీచేశారు. పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబును చైర్మన్‌గా, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, సీతక్మ, తుమ్మల నాగేశ్వర్రావు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సభ్యులుగా, ఎమ్మెల్యే పీ సుదర్శన్‌రెడ్డిని ప్రత్యేక ఆహ్వానితుడిగా, దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శిని కన్వీనర్‌గా నియమించారు. కమిటీ సాధ్యమైనంత తొందరలో తమ సిఫార్సులు అందించాలని ఉత్తర్వుల్లో స్పష్టంచేశారు.