Jani Master | డ్యాన్సర్‌పై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో కొరియోగ్రఫర్ జానీ మాస్టర్ (Jani Master)పై ఐపీసీ సెక్షన్ 376, 506, 323(2)తోపాటు పోక్సో కేసులు నమోదయ్యాయని తెలిసిందే. ఈ నేపథ్యంలో గోవాలో జానీ మాస్టర్‌ను అదుపులోకి తీసుకున్న సైబరాబాద్ పోలీసుల బృందం కోర్టులో హాజరుపరచగా.. రాజేంద్రనగర్ కోర్టు 14 రోజులపాటు రిమాండ్ విధించింది. ఈ నేపథ్యంలో పోలీసులు అతన్ని చర్లపల్లి జైలుకు తరలించారు.
తాజాగా జానీ మాస్టర్‌ను నార్సింగి పోలీసులు కస్టడీకి కోరారు. ఈ మేరకు రంగారెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వారం రోజుల కస్టడీ ఇవ్వాలని పిటిషన్లో కోరారు. మరి పిటిషన్‌పై కోర్టు స్పందన ఎలా ఉంటుందనేది చూడాలి. ఈ ఘటనలో పోలీసుల బృందం తొలుత గోవాలో అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తీసుకువచ్చారని తెలిసిందే. అనంతరం రాజేంద్రనగర్ సీసీఎస్ కార్యాలయంలో సీక్రెట్‌గా విచారించి ఉప్పరపల్లి కోర్టుకు తరలించారు.
పోలీసుల విచారణలో జానీ మాస్టర్ సంచలన విషయాలు చెప్పినట్టు వార్తలు వచ్చాయి. తాను ఎలాంటి లైంగిక వేధింపులకు పాల్పడలేదు. కావాలనే కొందరు తనపై ఫిర్యాదు చేయించారు. న్యాయపరంగా పోరాడి నిజాయితీగా బయటకు వస్తా. నన్ను ఇరికించినవాళ్లను వదిలిపెట్టనని ఈ సందర్భంగా జానీ మాస్టర్ హెచ్చరించాడు.
నార్సింగి పోలీసులు భాగంగా ఇప్పటికే ఈ కేసు విచారణలో భాగంగా బాధితురాలి వాంగ్మూలం తీసుకున్నారు. బాధితురాలిని ఇంట్లోనే విచారించిన పోలీసులు వివరాలు సేకరించిన అనంతరం ఆమెకు వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు.
Chiranjeevi | నా డ్యాన్స్‌లను ఇష్టపడిన ప్రతీ ఒక్కరికి అంకితం : గిన్నీస్ రికార్డ్‌పై చిరంజీవి
Priyanka Jawalkar | ట్రిప్‌లో స్టైలిష్‌గా ప్రియాంకా జవాల్కర్.. ఇంతకీ ఎక్కడికెళ్లిందో తెలుసా..?
Chiranjeevi | గిన్నీస్ రికార్డ్.. Most Prolific Film Star అవార్డు అందుకున్న చిరంజీవి
Chiranjeevi | డ్యాన్సుల్లో చిరంజీవి అరుదైన ఫీట్.. తొలి యాక్టర్‌గా గిన్నీస్ రికార్డ్