Jr NTR | ఆర్ఆర్ఆర్ సినిమాతో వరల్డ్‌వైడ్‌గా స్టార్డమ్ సంపాదించుకున్న టాలీవుడ్ హీరోల్లో టాప్‌లో ఉంటాడు గ్లోబర్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR). ఈ స్టార్ యాక్టర్ కాంపౌండ్ నుంచి అభిమానులు ఎప్పుడెప్పుడొస్తుందా..? అని ఎదురుచూస్తున్న చిత్రం దేవర (Devara). పాన్ ఇండియా బ్యాక్ డ్రాప్లో కొరటాల శివ (Siva Koratala) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం దేవర రెండు పార్టులుగా రానుండగా..దేవర పార్టు 1 సెప్టెంబర్ 27న థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కాబోతుంది.
విడుదలకు ముందే రికార్డులతో హోరెత్తిస్తున్నాడు ఎన్టీఆర్. తాజాగా ఓవర్సీస్లో అరుదైన రికార్డు నమోదు చేశాడు. నార్త్ అమెరికాలో దేవర ప్రీ సేల్స్‌లో 2 మిలియన్ డాలర్ల మార్క్‌ను దాటి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తున్నాడు తారక్. ప్రభాస్ తర్వాత వరుసగా రెండు సినిమాల (సలార్, కల్కి 2898 ఏడీ)తో ఈ ఫిగర్‌ను దాటిన తొలి భారతీయ నటుడిగా అదిరిపోయే ఫీట్‌ను సొంతం చేసుకున్నాడు తారక్. యూఎస్ఏలో దేవర ప్రీమియర్స్ సెప్టెంబర్ 26ను షురూ కానున్నాయి. యూఎస్ఏలో దేవర ప్రీమియర్స్ సెప్టెంబర్ 26ను షురూ కానున్నాయి.
క్తంతో సముద్రమే ఎరుపెక్కిన కథ.. మా దేవర కథ.. అంటూ యాక్షన్ పార్టుతో సాగుతున్న ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచడమే కాదు సూపర్ హైప్ క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తుండగా.. ప్రకాశ్ రాజ్, మలయాళ యాక్టర్ షైన్ టామ్ ఛాకో, శ్రీకాంత్, మురళీ శర్మ, హిమజ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ మిక్కిలినేని, కొనరాజు హరికృష్ణ, కల్యాణ్ రామ్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.
Chiranjeevi | నా డ్యాన్స్‌లను ఇష్టపడిన ప్రతీ ఒక్కరికి అంకితం : గిన్నీస్ రికార్డ్‌పై చిరంజీవి
Priyanka Jawalkar | ట్రిప్‌లో స్టైలిష్‌గా ప్రియాంకా జవాల్కర్.. ఇంతకీ ఎక్కడికెళ్లిందో తెలుసా..?
Rathnavelu | దేవరలో జాన్వీకపూర్ కనిపించేది అప్పుడేనట.. రత్నవేలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్