Hanu Man | ప్రశాంత్ వర్మ (Prasanth Varma) సినిమాటిక్ యూనివర్స్ నుంచి తేజ సజ్జా హీరోగా వచ్చిన ప్రాజెక్ట్ హనుమాన్ (Hanu Man). పాన్ ఇండియా సినిమాగా విడదలై ఇండియన్ బాక్సాఫీస్ వద్ద టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది. హనుమాన్ ఇక ఖండాంతరాల్లో కూడా ప్రేక్షకులను అలరించబోతుందని ఇప్పటికే ఓ వార్త తెరపైకి వచ్చింది. ఈ చిత్రం జపనీస్ భాషలో కూడా సందడి చేయనుందని.. అక్టోబర్ 4న జపాన్‌లో గ్రాండ్‌గా విడుదలకు సిద్దవుతుందని అప్డేట్ వచ్చింది.
తాజాగా ఇదే విషయాన్ని తెలియజేస్తూ.. కొత్త పోస్టర్ విడుదల చేశాడు ప్రశాంత్ వర్మ. హనుమాన్ గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద రూ.350 కోట్లు వసూళ్లు రాబట్టింది. బాహుబలి, ఆర్ఆర్ఆర్ తర్వాత జపాన్‌లో భారతీయ సినిమాలకు ప్రత్యేకించి తెలుగు సినిమాలకు సూపర్ క్రేజ్ వచ్చిందని తెలిసిందే. ఇప్పడిదే బాటలో హనుమాన్ కూడా విడుదలవుతూ హాట్ టాపిక్‌గా నిలుస్తోంది. జపాన్‌లోని పలు థియేటర్లలో హనుమాన్ తెలుగు వెర్షన్ జపనీస్ సబ్ టైటిల్స్‌తో స్క్రీనింగ్ కానున్నట్టు సమాచారం. హనుమాన్ ఇన్నాళ్లకు విడుదలవుతూ.. జపనీస్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వసూళ్లు రాబడుతుందో చూడాలి మరి.
హనుమాన్ తెలుగు రాష్ట్రాల్లో 25 సెంటర్లలో 100 బ్లాక్ బస్టర్ డేస్‌ను కూడా పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ జీ 5 (తెలుగు) లో, జియో సినిమా (హిందీ)లలో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీలో కోలీవుడ్ భామ అమృతా అయ్యర్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటించింది.
వరలక్ష్మి శరత్ కుమార్, వినయ్ రాయ్, రాజ్ దీపక్ శెట్టి, వెన్నెల కిశోర్ కీలక పాత్రల్లో నటించారు. హనుమాన్ చిత్రానికి గౌరా హరి-అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ సంయుక్తంగా మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. ఈ చిత్రాన్ని శ్రీమతి చైతన్య సమర్పణలో ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కే నిరంజన్ రెడ్డి నిర్మించారు.
#HanuMan is releasing in Japan on 4th Oct 2024! pic.twitter.com/wuo0FklyMk
— Prasanth Varma (@PrasanthVarma) September 25, 2024
Prakash Raj | చేయని తప్పుకి సారీ.. హాట్ టాపిక్‌గా ప్రకాశ్ రాజ్ మరో ట్వీట్
Devara Movie | ‘దేవర’ టికెట్ ధరలు.. నిర్మాతలకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు భారీ షాక్.!
Mohan Babu | మోహన్ బాబు ఇంట్లో చోరీ.. రూ.10 లక్షలతో ఉడాయించిన పనిమనిషి