Prakash Raj | తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో సినీ నటుడు ప్రకాశ్ రాజ్ (Prakash Raj), ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (pawan kalyan) మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే లడ్డూ వివాదంపై ప్రకాశ్ పవన్ కల్యాణ్ పేరు ప్రస్తావిస్తూ మీరు ఉపముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో జరిగిన ఘటన ఇది. దీనిపై విచారించి నేరస్తులపై చర్యలు తీసుకోండి.. మీరెందుకు అనవసర భయాలు కల్పించి.. ఈ విషయాన్ని జాతీయ స్థాయిలో చర్చించుకునేలా చేస్తున్నారని ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశాడు.
ఈ క్రమంలో ఈ వ్యవహారంతో ప్రకాశ్ రాజ్‌కు సంబంధమేంటని పవన్ కల్యాణ్ సీరియస్ అయ్యారు. దీనికి ప్రకాశ్ రాజ్స స్పందిస్తూ.. నేను ఇప్పుడు విదేశాల్లో షూటింగ్ ఉన్నా. మీకు వీలైతే నా ట్వీట్‌ను మళ్లీ చదవండి దయచేసి అర్థం చేసుకోండి. నేను చెప్పిందేంటి.. మీరు అపార్థం చేసుకొని చెబుతున్నదేమిటి. ఈ నెల 30న వచ్చి మీ ప్రతీ మాటకు సమాధానం చెబుతానన్నాడు.
తాజాగా విలక్షణ నటుడు మరో ట్వీట్ చేసి వార్తల్లో నిలిచాడు. చేయని తప్పుకి సారీ చెప్పించుకోవడంలో ఆనందమేంటో.. అంటూ జస్ట్ ఆస్కింగ్ హ్యాష్ ట్యాగ్‌ను జోడించాడు. తాజా ట్వీట్ డైలాగ్ వార్పైనేనని అర్థమవుతుండగా.. మరి పవన్ కల్యాణ్ స్పందిస్తారా.. లేదా అనేది చూడాలి.
చేయని తప్పుకి సారీ చెప్పించుకోవడంలో ఆనందమేంటో! జస్ట్ ఆస్కింగ్… #justasking
— Prakash Raj (@prakashraaj) September 25, 2024
Devara Movie | ‘దేవర’ టికెట్ ధరలు.. నిర్మాతలకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు భారీ షాక్.!
Mohan Babu | మోహన్ బాబు ఇంట్లో చోరీ.. రూ.10 లక్షలతో ఉడాయించిన పనిమనిషి
Rathnavelu | దేవరలో జాన్వీకపూర్ కనిపించేది అప్పుడేనట.. రత్నవేలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్