Bipasha Basu | టాలీవుడ్ స్టార్ యాక్టర్ మహేశ్ బాబు నటించిన టక్కరి దొంగ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హాయ్ చెప్పింది ఢిల్లీ సుందరి బిపాషా బసు (Bipasha Basu). ఆ తర్వాత హిందీ సినిమాలకే పరిమితమైపోయింది. చివరగా వెల్ కమ్ టు న్యూయార్క్ సినిమాలో నటించిన ఈ భామ ఆ తర్వాత సిల్వర్ స్క్రీన్‌పై కనిపించలేదు. చాలా రోజులుగా ఈ భామ నెట్టింట ప్రత్యక్షమైంది. ఓ ఆసక్తికర విషయాన్ని అందరితో షేర్ చేసుకుంది.
తన బాయ్‌ఫ్రెండ్ కోసం పూర్తిగా శాఖాహారి ( vegetarian)గా మారిన విషయాన్ని చెప్పింది బిపాషా బసు. దీని గురించి మాట్లాడుతూ.. నేను స్కూల్ నుంచి తిరిగొచ్చిన తర్వాత ప్రేమలో పడ్డానని అమ్మతో చెప్పా. ఎదురుగా నిలబడి ఉన్న అమ్మ ఇది విని ఒక్కసారి స్పృహ తప్పి బెడ్ మీద పడిపోయింది. నువ్వేం చెప్పవా.. నాకు రెండు సల్వార్ కుర్తాస్ కావాలని అడిగా. అంతకంటే ముందు నేను షార్ట్స్ (పొట్టి డ్రెస్) వేసుకున్నా. అతడు (బాయ్‌ఫ్రెండ్) మార్వాడి కుటుంబానికి చెందిన వ్యక్తి. అతని ఫ్యామిలీ ఇవాళ్టి నుంచి నేను సల్వార్ కుర్తా వేసుకోవాలని అడిగారు.. నేటి నుంచి నేనిక శాఖాహారిని.. కానీ అంతకంటే ముందుకు నేను హార్డ్ కోర్ నాన్ వెజీరియన్ (non vegetarian)ను అంటూ చెప్పుకొచ్చింది బిపాషా బసు. ఈ కామెంట్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
ఈ భామ 2020లో క్రైం థ్రిల్లర్ Dangerousతో ఓటీటీలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కొత్త ప్రాజెక్టులేమి ప్రకటించలేదు. మరి రానున్న రోజుల్లో బిపాషా బసు నుంచి ఏదైనా మూవీ అప్డేట్ వస్తుందేమో చూడాలంటున్నారు మూవీ లవర్స్.
Amaran | ఇందు రెబెకా వర్గీస్‌గా సాయిపల్లవి.. శివకార్తికేయన్ అమరన్ ఇంట్రో వీడియో వైరల్
Devara Review | దేవర మూవీ రివ్యూ: ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ కొట్టాడా? లేదా ?
Prakash Raj | గెలిచే ముందొకటి.. గెలిచిన తర్వాత ఇంకోటి.. పవన్ కల్యాణ్‌పై ప్రకాశ్‌రాజ్ ఫైర్