Devara Twitter Review | టాలీవుడ్ స్టార్ యాక్టర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) టైటిల్ రోల్లో నటిస్తోన్న చిత్రం దేవర (Devara). కొరటాల శివ (Siva Koratala) దర్శకత్వంలో రెండు పార్టులుగా వస్తుండగా.. దేవర పార్టు 1 నేడు (సెప్టెంబర్ 27న) ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో థియేటర్లలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది.
బాలీవుడ్ భామ జాన్వీకపూర్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటించింది. సైఫ్ అలీఖాన్ భైర పాత్రలో నటించాడు. ఈ ఇద్దరికీ టాలీవుడ్ ఎంట్రీ ప్రాజెక్ట్ కావడంతో సినిమాపై అంచనాలు భారీగానే నెలకొన్నాయి.
ప్రీ సేల్స్‌లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచిన దేవర మరి బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకుల అంచనాలు అందుకున్నాడ ..? తారక్ అభిమానులకు కావాల్సిన ఎలిమెంట్స్ ఉన్నాయా..? అనే దానిపై నెటిజన్లు ఏమంటున్నారో ఓ లుక్కేస్తే..
నెట్టింట టాక్ ఎలా ఉందంటే..?
క్లైమాక్స్ ట్విస్ట్ అంచనా వేయలేమని, సెకండాఫ్ ఎంగేజింగ్‌గా చూపించాడని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు.
దేవర గేమ్ ఛేంజర్. కేవలం సౌతిండియన్ సినిమానే కాదు.. భారతీయ సినిమా. బిగ్గెస్ట్ హిందీ బ్లాక్ బస్టర్ రికార్డులను అధిగమించే దిశగా వెళ్లడం ఖాయం.
సినిమాటిక్ మాస్టర్‌పీస్ అప్పీల్‌తో దేవర ఫస్ట్ హాఫ్ ఉత్కంఠభరితంగా సాగుతుంది. చివరి 20 నిమిషాలు పవర్ ఫుల్ ఎండింగ్‌తో గూస్బంప్స్ తెప్పించడం ఖాయమని మరో యూజర్ రాసుకొచ్చాడు.
గూస్ బంప్స్ తెప్పించే సన్నివేశాలు, జూనియర్ ఎన్టీఆర్ అదిరిపోయే ఎంట్రీ.. టైటిల్ కార్డు, సైఫ్ అలీఖాన్‌తో ఇతర యాక్టర్ల పర్ఫార్మెన్స్, అద్భుతమైన విజువల్స్, అనిరుధ్ బీజీఎంతో అభిమానులకు విజువల్ ఫీస్ట్‌లా ఉంటుందని మరో యూజర్ కామెంట్ పెట్టాడు.
ఫస్ట్ హాఫ్ సూపర్.. సెకండాఫ్ యావరేజ్. తారక్ నటన, ఫియర్ సాంగ్ సినిమాకు మెయిన్ హైలెట్ అని మరో నెటిజన్ ట్వీట్ చేశాడు.
కొరటాలకు మరో ఆచార్య.. బీజీఎం అదిరింది.. వీఎఫ్ఎక్స్ ఆచార్య కంటే ఉత్తమంగా ఉన్నాయని ట్వీట్ చేశాడు..
తారక్, జాన్వీకపూర్ యాక్టింగ్ బాగుంది. ఫస్ట్ హాఫ్ ఎలివేషన్స్ ఫైరింగ్ మూడ్‌లో సాగుతుంది. ప్రీ ఇంటర్వెల్, ఇంటర్వెల్ బ్యాంగ్ స్టన్నింగ్‌గా ఉంది. అదిరిపోయే బీజీఎంతో ఎపిక్ ఫైట్ సీక్వెన్స్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలుస్తుంది. ఎండింగ్లో పార్ట్ 2 శౌర్యాంగ పర్వం టైటిల్‌ను రిలీజ్ చేస్తారని మరో యూజర్ కామెంట్ పెట్టాడు.
ఎక్స్ ఆన్లైన్ ఖాతాలో మరో ట్వీట్..
తారక్ పర్ఫార్మెన్స్ , స్క్రీన్ అప్పిరియన్స్ తో మ్యాడ్ మాక్స్ ఫస్ట్ హాఫ్..
బోట్ ఫైట్ సీన్, ప్రీ ఇంటర్వెల్ ఫైట్ సీన్ యాక్షన్ సీక్వెన్స్ గూస్బంప్స్ అంతే.
అనిరుధ్ బీజీఎం ఎలివేషన్ బాగుంది. ఫియర్ సాంగ్, ఆయుధ పూజ సాంగ్‌కు థియేటర్లలో ఫైర్.
సైఫ్ అలీ ఖాన్ తన పాత్రలో జీవించేశాడు. ఫ్లాష్ బ్యాక్ సీక్వెన్స్ అద్భుతంగా చూపించాడు.
#Devara Climax Twist 💥🔥🔥🔥 Totally UNEXPECTED 💣💥 @tarak9999
What an Engaging Second Half 🔥
BIGGGGG BLOCKBUSTER 🏆🏆🏆
— PALANADUP (@PalanaduP) September 26, 2024
https://t.co/E7U5AHIWP0…#Devara Review
FIRST HALF
Rating ⭐⭐⭐⭐4/5 !!
Good with some scenes of goosebumps 🔥#JrNTR is terrific & his entry & title card 💥#SaifAliKhan, @KalaiActor & others are good too ✌️
Visuals are decent 👍
BGM by @anirudhofficial 💥🔥
Interval… pic.twitter.com/LxNUG81amh
— Mr.Meraj (@merajali321) September 26, 2024
Super first half❤️ and average second half 😂and highlights of the movie is fear song and tarak anna acting 🔥 pic.twitter.com/SzYoBbyemG
— Mega cult💥✊ (@royal22351) September 26, 2024
Average first half🙂
Rod second half👎🏻
Another acharya for koratala 🤭BGM🔥🔥🔥VFX just better than acharya👎🏻
NTR🔥 saif🥵Jahnavi👍
Water and shark scenes🙏🏻
2/5
Munde cheptunna first half chusi bytiki vacheyandi#DevaraBookings #DevaraCelebrations #devara pic.twitter.com/qfp92BrAEe— divya vora 🌺💫💫✨ (@voradivya2001) September 27, 2024