Amaran | కోలీవుడ్ స్టార్ యాక్టర్ శివకార్తికేయన్ (Sivakarthikeyan) వరుస సినిమాల్లో నటిస్తున్నాడని తెలిసిందే. వీటిలో ఒకటి SK21. రాజ్‌కుమార్ పెరియసామి (Rajkumar Periasamy) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ అమరన్ (Amaran) టైటిల్‌తో తెరకెక్కుతోంది. ఈ మూవీలో సాయిపల్లవి ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తుంది.
అమరన్‌లో సాయిపల్లవి మేజర్ ముందుకు సతీమణి ఇందు రెబెకా వర్గీస్ పాత్రలో నటిస్తోంది. తాజాగా ఆమె పాత్రకు సంబంధించిన ఇంట్రడక్షన్ వీడియోను షేర్ చేశారు మేకర్స్. ఈ సినిమా మేజర్ ముకుంద్ జీవితంలో పలు కోణాలను ఆవిష్కరిస్తూ ఉండబోతుందని తాజా విజువల్స్ చెబుతున్నాయి. ఇక సాయిపల్లవి ఇందు రెబెకా వర్గీస్ పాత్రలో జీవించేసినట్టు అర్థమవుతోంది.
ఈ చిత్రంలో విశ్వరూపం ఫేం రాహుల్ బోస్ (RahulBose) విలన్‌గా నటిస్తున్నాడు. ఈ మూవీని కథానుగుణంగా ఎక్కువ భాగం కశ్మీర్లో 75 రోజులపాటు పూర్తి చేసినట్టు తెలియజేస్తూ మేకర్స్ ఇప్పటికే ఓ వార్తను కూడా అందరితో షేర్ చేసుకున్నారు. ఇక కశ్మీర్ షూటింగ్ లొకేషన్లో సాయిపల్లవి, శివకార్తికేయన్ దిగిన ఫొటోలు ఇప్పటికే నెటిజన్లను ఇంప్రెస్ చేస్తున్నాయి.
ఈ సినిమా కోసం గైడ్ చేసిన రియల్ హీరోలు ఇండియన్ మిలటరీ జవాన్లకు ధన్యవాదాలు తెలియజేస్తూ… మరోవైపు ఇండిపెండెన్స్ డే సందర్భంగా రిలీజ్ చేసిన మేకింగ్ వీడియోలు సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి.
Cupid strikes Amaran… #SaiPallavi as Indhu Rebecca Varghese, the Heart of Amaran
▶️ https://t.co/Wux9tKHnQ9#Amaran #AmaranDiwali #AmaranOctober31#Ulaganayagan #KamalHaasan #Sivakarthikeyan #SaiPallavi #RajkumarPeriasamy
A Film By @Rajkumar_KP@ikamalhaasan… pic.twitter.com/RYIcjXhuof
— Raaj Kamal Films International (@RKFI) September 27, 2024
అమరన్ ఇంట్రో..
Devara Review | దేవర మూవీ రివ్యూ: ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ కొట్టాడా? లేదా ?
Prakash Raj | గెలిచే ముందొకటి.. గెలిచిన తర్వాత ఇంకోటి.. పవన్ కల్యాణ్‌పై ప్రకాశ్‌రాజ్ ఫైర్