Zebra | బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు సత్యదేవ్ (Satyadev). హిట్టు, ఫ్లాపుతో సంబంధం లేకుండా కథా బలమున్న సినిమాలను చేసే ఈ టాలెంటెడ్ యాక్టర్ నటిస్తోన్న తాజా చిత్రం జీబ్రా (Zebra). ఈశ్వర్ కార్తీక్ (Eswar Karthik) దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ టీజర్ అప్డేట్ అందించారు. జీబ్రా టీజర్‌ను నాని లాంఛ్ చేయబోతున్నాడు.
జీబ్రా ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు రేపు ఉదయం 11 : 34 గంటలకు నాని చేతుల మీదుగా జీబ్రా టీజర్ ఉండబోతున్నట్టు తెలియజేశారు. ఈ మూవీని అక్టోబర్ 31న తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. యాక్షన్ క్రైమ్ ఎంటర్టైనర్గా వస్తోన్న ఈ చిత్రంలో సత్యదేవ్‌కు జోడీగా ప్రియా భవానీ శంకర్ నటిస్తుంది.
పుష్ప ఫేం ధనంజయ (జాలిరెడ్డి) కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఓల్డ్ టౌన్ పిక్చర్స్, పద్మ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఎస్ఎన్ రెడ్డి, బాలసుందరం, దినేష్ సుందరం సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. హీరోగానే కాకుండా ఇతర కీలక పాత్రల్లో కూడా నటిస్తోన్న సత్యదేవ్ ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తున్నాడు.
Glimpse into the 𝐖𝐎𝐑𝐋𝐃 𝐎𝐅 #Zebra to be launched in Telugu by NATURAL STAR 🌟 @NameisNani 🤩#ZEBRATeaser Out Tomorrow @ 11:34 AM! 🔥#ZEBRAOnOct31 ❤🔥 pic.twitter.com/JFB5BXLbdl
— Sai Satish (@PROSaiSatish) September 29, 2024
Bhaagamathie 2 | భాగమతి మళ్లీ వచ్చేస్తుంది.. అనుష్క భాగమతి 2పై డైరెక్టర్ అశోక్ క్లారిటీ
Bipasha Basu | బిపాషా బసు బాయ్ ఫ్రెండ్ కోసం శాఖాహారిగా మారిందట..!
Devara Review | దేవర మూవీ రివ్యూ: ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ కొట్టాడా? లేదా ?
Prakash Raj | గెలిచే ముందొకటి.. గెలిచిన తర్వాత ఇంకోటి.. పవన్ కల్యాణ్‌పై ప్రకాశ్‌రాజ్ ఫైర్