IND vs ENG : సొంతగడ్డపై ఓ రేంజ్లో చెలరేగకపోయినా.. సెమీస్ దూసుకెళ్లిన భారత జట్టు అసలైన ఆట చూపించాల్సిన సమయమొచ్చింది. సూపర్ 8 చివరి మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను చిత్తు చేసిన ఉత్సాహంతో ఇంగ్లండ్‌ను ఓడిస్తే ఫైనల్ బెర్తు సొంతమైనట్టే. వాంఖడేలో టాస్ గెలిచిన హ్యారీ బ్రూక్ ఛేదనకే మొగ్గు చూపుతూ బౌలింగ్ తీసుకున్నాడు.
వరుసగా మూడో సెమీఫైనల్లో ఇరుజట్లు తలపడుతున్న వేళ.. వాంఖడేలో విజయంతో మురిసేది ఎవరు? అనేది ఉత్కంఠ రేపుతోంది. బ్యాటింగ్‌లో కెప్టెన్ హ్యారీ బ్రూక్.. విల్ జాక్స్ మెరుపులనే నమ్ముకున్న ఇంగ్లండ్‌కు.. సూర్యకుమార్ యాదవ్ సేన చెక్ పెట్టాలంటే బౌలింగ్ దళం గొప్పగా రాణించాల్సిందే. తొలి మ్యాచ్‌లో యూఎస్ఏపై ఒంటరి సైనికుడిలా పోరాడినా సూర్య మరోసారి వాంఖడేలో తన మ్యాజిక్ చూపించాలని టీమిండియా కోరుకుంటోంది.
Harry Brook wins the toss, England will bowl first in the #T20WorldCup semi-final in Mumbai
Follow live: https://t.co/ocWPoSgbyB pic.twitter.com/uJBKXSkPpj
— ESPNcricinfo (@ESPNcricinfo) March 5, 2026
భారత్ తుది జట్టు : అభిషేక్ శర్మ, సంజూ శాంసన్(వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా.
ఇంగ్లండ్ తుది జట్టు : ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్(వికెట్ కీపర్), హ్యారీ బ్రూక్(కెప్టెన్), జాకబ్ బెథెల్, టామ్ బ్యాంటన్, సామ్ కరన్, విల్ జాక్స్, జేమీ ఓవర్టన్, లియాం డాసన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్.
కీలకమైన ఈ మ్యాచ్‌కోసం ఇంగ్లండ్ ఒక మార్పు చేసింది. రెహాన్ అహ్మద్ స్థానంలో ఓవర్టన్ను ఆడిస్తున్నామని బ్రూక్ చెప్పాడు. తేమ పెద్దగా ప్రభావం చూపదని భావిస్తున్నట్టు చెప్పిన సూర్య.. టీమిండియా మాత్రం ఏ మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నామని వెల్లడించాడు.