Naga Chaitanya | నా కెరీర్లో బిగ్గెస్ట్ మైలురాయి: ‘వృషకర్మ’తో సరికొత్త హిస్టరీ క్రియేట్ చేస్తామంటున్న అక్కినేని హీరో!
Vrushakarma | అక్కినేని నాగచైతన్య కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న మైథలాజికల్ థ్రిల్లర్ ‘వృషకర్మ’ (Vrushakarma). ఈ సినిమా గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‌లో నేడు ఘనంగా జరిగింది.
Vrushakarma | అక్కినేని నాగచైతన్య కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న మైథలాజికల్ థ్రిల్లర్ ‘వృషకర్మ’ (Vrushakarma). ఈ సినిమా గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్‌లో నేడు ఘనంగా జరిగింది. అయితే ఈ సందర్భంగా హీరో నాగచైతన్య మాట్లాడుతూ.. దర్శకుడు కార్తీక్ దండు విజన్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.
తను ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న కథ ఇదని, ఖచ్చితంగా తన కెరీర్లోనే ఇది ఒక మైలురాయిగా నిలిచిపోతుందని నాగ చైతన్య ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యంగా ‘తండేల్’ సినిమా షూటింగ్ సమయంలోనే ఈ కథ గురించి తెలిసిందని, కార్తీక్ దండును కలిసి ఈ ప్రాజెక్ట్ తానే చేస్తానని అడిగి మరీ తీసుకున్నట్లు చైతన్య వెల్లడించారు. ఈ చిత్రంలో తాను ‘ట్రెజర్ హంటర్’ (నిధి అన్వేషకుడు) పాత్రలో కనిపిస్తానని, స్క్రిప్ట్ వర్క్ కోసం దాదాపు ఎనిమిది నెలల పాటు కసరత్తులు చేశామని పేర్కొన్నాడు. అభిమానులు కోరుకునే భారీ కమర్షియల్ సక్సెస్‌ను ఈ సినిమా అందిస్తుందని, ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాలు ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్తాయని చైతూ చెప్పుకొచ్చారు. ఇక గ్రాఫిక్స్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని దర్శకుడు కార్తీక్ దండు తెలిపారు. విజువల్ ఎఫెక్ట్స్ కోసం ఇప్పటికే క్లైమాక్స్ షూటింగ్‌ను పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులకు పంపామని, ట్రైలర్ విడుదల సమయంలో సీక్వెల్ గురించి స్పష్టత ఇస్తామని ఆయన మీడియాకు వివరించారు. తన 25వ సినిమా వివరాలను కూడా త్వరలోనే ప్రకటిస్తానని నాగచైతన్య ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్‌లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

