Toli chowki | హైదరాబాద్ టోలీచౌకిలోని అల్ హస్నాత్ కాలనీలో భవన నిర్మాణ పనులు చేస్తుండగా పరందా కూలిన విషయం తెలిసిందే. నిర్మాణ పనులు చేస్తున్న కార్మికుల్లో ప్రమాదవశాత్తు ఐదుగురు కార్మికులు కింద పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందగా.. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. బాధితులను ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు.
కాగా ఘటనాస్థలాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సందర్శించారు. ప్రమాదం జరిగిన తీరును, రెస్క్యూ టీం సహాయక చర్యలను గురించి అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అందిస్తున్న చికిత్స గురించి ఆరా తీశారు. కొత్త భవనానికి గోవా కర్రలు కట్టి.. కార్మికులు వాటిపై నిలబడి పనులు చేస్తుండగా సడెన్గా ఆ కట్టెలు కూలిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది.

Loco Pilot Refuses To Work | పని గంటలు ముగిశాయని.. రైలు నడిపేందుకు నిరాకరించిన లోకో పైలట్
Iran Minister Abbas Araghchi: భారత అతిథిపై దాడి చేశారు: ఇరాన్ మంత్రి అబ్బాస్
Kalyana Kanuka | ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చిన బీఆర్ఎస్ సర్పంచ్