తుంగతుర్తి, జూలై 30 : తుంగతుర్తి మండల పరిధిలోని గానుగబండ గ్రామంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను వంద శాతం పూర్తి చేసిన బీఎల్ఎలు శోభారాణి, స్రవంతిలను గురువారం బీఆర్ఎస్ నాయకులు శాలువాతో సన్మానించారు. సర్ ప్రక్రియను వంద శాతం పూర్తి చేసిన బీఎల్ఓలకు సర్పంచ్ మాతంగి వెంకటమ్మ కరుణాకర్ శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకుడు రాములు గౌడ్, దుర్గయ్య గుండగాని వీరయ్య, నరేష్ పాల్గొన్నారు.