భోపాల్: సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్(Madhya Pradesh Influencer) నిధి తివారి ఆత్మహత్య చేసుకున్నది. ఆమెకు ఫేస్బుక్, ఇన్స్టాలో సుమారు 16 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆమె వయసు 30 ఏళ్లు. ఎఫ్బీలో 9 లక్షలు, ఇన్స్టాలో 7 లక్షల మంది ఆమెకు ఫాలోవర్లు ఉన్నారు. వింధ్యా పర్వత ప్రాంతానికి చెందిన ఫేమస్ సోషల్ మీడియా పర్సనాల్టీగా ఆమెకు గుర్తింపు ఉన్నది. సోషల్ మీడియాలో ఆమె చేస్తున్న పోస్టులకు రెగ్యులర్గా రియాక్షన్స్ వస్తుంటాయి. ఆమె వీడియోలను కూడా లక్షలాది మంది వీక్షిస్తుంటారు.
2024లో నిధి తివారికి.. మిస్ ప్రిట్టీ ఇండియా టైటిల్ దక్కింది. మోడలింగ్, యాక్టింగ్ కెరీర్లో ఆమె కెరీర్ కోసం ప్రయత్నిస్తున్నది. శనివారం బుసా మోడ్లో ఆమె ఇంటి వద్ద మృతదేహాన్ని గుర్తించారు. అయితే ఆస్పత్రికి తీసుకెళ్లడంతో.. డాక్టర్లు ఆమెను మృతిచెందినట్లు ప్రకటించారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో కెరీర్ను ప్రారంభించాలని ఆమె భావించినట్లు స్థానికులు చెప్పారు.
గుర్తు తెలియని వ్యక్తితో శనివారం నిధి ఫోన్లో మాట్లాడిందని, ఆ తర్వాత ఈ ఘటన చోటుచేసుకున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. మృతికి కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు. కాల్ రికార్డులు, డిజిటల్ యాక్టివిటీ, ఇతర ఆధారాలను పరిశీలిస్తున్నారు. మోర్వా పోలీసులు సమాచారాన్ని సేకరిస్తున్నారు.