Niroshan Dickwella : శ్రీలంక క్రికెటర్ నిరోషన్ డిక్వెల్లా (Niroshan Dickwella) కెరీర్‌కు ఫుల్స్టాప్ పడింది. ఇప్పటికేజాతీయ జట్టుకు దూరమైన అతడు తాజాగా నిషేధానికి గురయ్యాడు. డోప్ పరీక్ష(Dope Test)లో విఫలమైన అతడిని శ్రీలంక క్రికెట్(Srilanka Cricket) బోర్డు మూడేండ్ల పాటు సస్పెండ్ చేసింది. ఈ కాలంలో అతడు ఫ్రాంచైజీ క్రికెట్ కూడా ఆడడానికి వీల్లేదని స్పష్టం చేసింది. లంక ప్రీమియర్ లీగ్ (LPL) సమయంలో నిరోషన్ డోప్ టెస్టులో దొరికిపోయాడు.
సొంతగడ్డపై జరిగిన ఎల్పీఎల్ సమయంలో నిరోషన్ నుంచి సేకరించిన నమూనాల్లో నిషేధిత డ్రగ్ కనిపించింది. అంతర్జాతీయ డోపింగ్ ఏజెన్సీ నియమాలను ఉల్లంఘించిన అతడిపై లంక బోర్డు కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. తదుపరి ప్రకటన చేసేంత వరకు నిరోషన్పై నిషేధం కొనసాగుతుందని తెలిపింది. అన్నట్టుగానే తాజాగా అతడిపై మూడేండ్ల నిషేధం విధించింది. లంక ప్రీమియర్ లీగ్‌లో నిరోషన్ గాలె మార్వెల్స్(Galle Marvels) జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు.
BREAKING:
Sri Lankan wicket-keeper batsman Niroshan Dickwella banned for 3 YEARS from all formats of cricket!
#Dickwella #SLvsNZ pic.twitter.com/A88s5yGRfY— Berzabb (@Berzabb) September 29, 2024
వికెట్ కీపర్, బ్యాటర్ అయిన నిరోషన్పై లంక బోర్డు 2021లోనూ వేటు వేసింది. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా అతడిని పక్కన పెట్టేసింది. ఆ తర్వాత జట్టులోకి వచ్చిన నిరోషన్ 2023 మార్చిలో దేశం తరఫున ఆఖరి మ్యాచ్ ఆడాడు. ఈ ఏడాది బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు ఎంపికయ్యాడు. కానీ, ఒక్క మ్యాచ్‌లోనూ ఆడలేదు. ఇప్పటివరకూ లెఫ్ట్ హ్యాండర్ టెస్టుల్లో 2,757, వన్డేల్లో 1,604 రన్స్ చేశాడు. ఇక టీ20ల్లో నిరోషన్ 480 పరుగులు సాధించాడు.