లక్నో: సోషల్ మీడియా రీల్స్ కోసం ఒక వ్యక్తి ప్రమాదకరంగా స్టంట్ చేశాడు. జాతీయ రహదారిలోని సైన్‌బోర్డును పట్టుకుని పుల్అప్స్ తీశాడు. (Man Do Pull-Ups Holding Signboard) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో పోలీసులు స్పందించారు. ఆ వ్యక్తిపై చర్యలకు సిద్ధమయ్యారు. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. అమేథీ సమీపంలోని జాతీయ రహదారి 931లో పది మీటర్ల ఎత్తులో ఉన్న సైన్బోర్డ్పైకి ఇద్దరు వ్యక్తులు ఎక్కారు. ఒక వ్యక్తి ఆ బోర్డును పట్టుకుని కిందకు వేలాడుతూ ప్రమాదకరంగా పుల్అప్స్ తీశాడు.
కాగా, ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఇది పోలీసుల దృష్టికి వెళ్లింది. అమేథీ పోలీసులు దీనిపై స్పందించారు. ఈ వీడియోపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. జాతీయ రహదారిలోని సైన్‌బోర్డును పట్టుకుని ప్రమాదకంగా వేలాడుతూ స్టంట్ చేసిన వ్యక్తులపై తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
#अमेठी:अमेठी की सड़कों पर खतरों के खिलाड़ी,किलोमीटर के सांकेतिक बोर्ड पर पुशअप करता नजर आया युवक,जान हथेली पर डालकर सड़क से 10 मीटर ऊपर बोर्ड पर पुशअप कर रहा युवक,सचिन नाम के इंस्टाग्राम आईडी से वीडियो किया गया है पोस्ट @amethipolice @DmAmethi pic.twitter.com/Qq5kCkgcCl
— AMETHI LIVE (@AmethiliveCom) September 29, 2024