Tata Motors | తమిళనాడులో టాటా మోటార్స్ మాన్యుఫాక్చరింగ్ ఫెసిలిటీ.. 5000 మందికి కొత్త ఉద్యోగాలు..!
Tata Motors | తమిళనాడులోని పనపక్కం జిల్లా పరిధిలో టాటా మోటార్స్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ నిర్మాణానికి సీఎం ఎంకే స్టాలిన్ శంకుస్థాపన చేశారు.
Tata Motors | తమిళనాడులోని పనపక్కం జిల్లా పరిధిలో టాటా మోటార్స్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ నిర్మాణానికి సీఎం ఎంకే స్టాలిన్ శంకుస్థాపన చేశారు. రూ.9000 కోట్ల అంచనా వ్యయంతో టాటా మోటార్స్ తన న్యూ మాన్యుఫాక్చరింగ్ ఫెసిలిటీని నిర్మించనున్నది. దీనివల్ల యువతకు కొత్తగా 5,000 ఉద్యోగాలు వస్తాయి. రాష్ట్ర రాజధాని చెన్నైకి 115 కి.మీ దూరంలో ఈ మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ఉంటుంది. సీఎం ఎంకే స్టాలిన్ తోపాటు రాష్ట్ర మంత్రులు దురాయి మురుగన్, టీఆర్బీ రాజా, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎన్ మురుగానందం, టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎంకే స్టాలిన్ మాట్లాడుతూ తమిళనాడులో మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని టాటా మోటార్స్ ప్రణాళిక రూపొందించడం సంతోషంగా ఉందన్నారు. దేశంలోని పెద్ద కంపెనీలకు, మల్టీ నేషనల్ కంపెనీలకు తమిళనాడు తొలి పెట్టుబడి కేంద్రంగా నిలుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో చంద్రశేఖరన్ పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. తమిళనాడులోని నామక్కల్ జిల్లా వాసి ప్రపంచంలోనే పేరొందిన కంపెనీకి సారధ్యం వహించడం రాష్ట్రానికే గర్వ కారణం అని పేర్కొన్నారు. తమిళనాడులో మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వంతో మార్చిలో టాటా మోటార్స్ అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘కాళోజీ ఆశయ సాధనకు కృషి చేయాలి’
నిఫ్ట్ విద్యార్థుల సెరికల్చర్ రిసోర్స్ సెంటర్ సందర్శన
Burglars loot jewellery showroom | నిన్న తనిష్క్, ఇవాళ కిస్నా.. జ్యుయలరీ షాపులో భారీ దోపిడి.. రూ.10 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు చోరీ
కారేపల్లిలో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభం
Arrest | ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ధర్నా, అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

