లాహోర్: తమతో ముందుగా ఒప్పందం కుదుర్చుకుని తర్వాత ఐపీఎల్ (కేకేఆర్ తరఫున) ఆడేందుకు వచ్చిన జింబాబ్వే పేసర్ బ్లెస్సింగ్ ముజారబనిపై పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) చట్టపరమైన చర్యలకు దిగేందుకు సిద్ధమైంది.
ఈ జింబాబ్వే బౌలర్ గతంలో పీఎస్ఎల్ ఫ్రాంచైజీ ఇస్లామాబాద్ యునైటైడ్తో ఒప్పందం కుదుర్చుకున్నా అతడు దానిని ఉల్లంఘించి కోల్‌కతా నైట్ రైడర్స్‌తో కలిశాడు. దీనిపై ఇస్లామాబాద్ ఫ్రాంచైజీ.. అతడిపై చట్టపరమైన చర్యల కోసం ఉపక్రమిస్తున్నట్టు ఆ జట్టు వర్గాలు తెలిపాయి.