ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Siddipet - Jan 12, 2021 , 00:08:57

సైన్స్‌ పరిశోధనలకు ఆహ్వానం

సైన్స్‌ పరిశోధనలకు ఆహ్వానం

పరిశోధన పత్రాల సమర్పణకు ఫిబ్రవరి 8 ఆఖరు

జిల్లా విద్యాధికారి రవికాంతారావు 

సిద్దిపేట అర్బన్‌, జనవరి 11 : ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్‌ దినోత్సవాన్ని పురస్కరించుకొని స్టేట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ రీసెర్చ్‌, హైదరాబాద్‌ వారు సైన్స్‌ సెమినార్‌ కోసం పరిశోధనా పత్రాలను ఆహ్వానిస్తున్నారని డీఈవో రవికాంతారావు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని సైన్స్‌ ఉపాధ్యాయులు, టీచర్‌ ఎడ్యుకేటర్స్‌, పరిశోధకులు, విద్యారంగంలో పని చేసే నిష్ణాతుల నుంచి ‘భారతదేశాన్ని అభివృద్ధ్ది చేయడానికి సైన్స్‌ ఎడ్యుకేషన్‌' అనే అంశంపై పరిశోధనా పత్రాలను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. సెమినార్‌ కోసం మూడు ఉప అంశాల నుంచి పరిశోధన పత్రాలను పంపించాలన్నారు. అందులో 1. సైన్స్‌ ఫర్‌ సెల్ఫ్‌ రిలెవంట్‌ ఇండియా (ఆత్మనిర్భర్‌ భారత్‌) దానికి పొందడానికి తరగతి వెలుపల ప్రభావవంతం చేయడానికి మార్గాలు 2. జాతీయ విద్యావిధానం ఎన్‌ఈపీ-2020 వెలుగులో సైన్స్‌ విద్యను మరింత ప్రభావవంతం చేయడానికి మార్గాలు 3. ఆటలను, బొమ్మలతో సైన్స్‌ బోధించడానికి బోధనా సాధనాలుగా ఉపయోగించుట.. అనే అంశాలపై ఇంగ్లిష్‌ లేదా తెలుగులో పరిశోధన పత్రం పంపించాలన్నారు. పరిశోధనా పత్రం తయారీలో ఉపాధ్యాయుని పేరు, చిరునామా, ఫోన్‌ నంబర్‌, మెయిల్‌ ఐడీ, అర్హత మొదలైన వ్యక్తిగత వివరాలతో పాటు ఉప అంశం, అంశం శీర్షిక, పరిచయం, లక్ష్యం, ప్రదర్శన, ఫలితం, సూచనలు, ప్రస్తావనలు మొదలైనవి ఉండాలన్నారు. పరిశోధనా పత్రాలను పంపించడానికి ఫిబ్రవరి 8 ఆఖరు అన్నారు. మెయిల్‌ ఐడీ tgs certmathsscience @gmail. com లో పంపించాలన్నారు. ఎంపిక కాబడిన ఉపాధ్యాయులు ఫిబ్రవరి 28న ఇంటర్నెట్‌లో తమ పరిశోధనా పత్రాలను ప్రదర్శించి వివరించాల్సి ఉంటుందని తెలిపారు. వివరాలకు జిల్లా సైన్స్‌ అధికారి కే.మహేందర్‌, ఫోన్‌ నంబర్‌ 9949560 565కు సంప్రదించాలన్నారు. ఈ సెమినార్‌లో సైన్స్‌ ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని డీఈవో కోరారు. 

VIDEOS

logo