ఆదివారం 09 ఆగస్టు 2020
Science-technology - Jul 13, 2020 , 16:18:55

సూర్యుడి కంటే పెద్దదైన నక్షత్రం గెలాక్సీ నుంచి అదృశ్యమైందట!

సూర్యుడి కంటే పెద్దదైన నక్షత్రం గెలాక్సీ నుంచి అదృశ్యమైందట!

లండన్‌ : సూర్యుడి కంటే 2.5 మిలియన్ రెట్లు ప్రకాశవంతంగా ఉన్న నక్షత్రం 2019లో ఎలాంటి జాడ లేకుండా అదృశ్యమైందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఎల్‌బీవీ (లూమినిసన్‌ బ్లూ వేరియబుల్) అదృశ్యానికి గల కారణాలను కనుగునేందుకు ఖగోళ భౌతిక శాస్త్రవేత్తల బృందం ప్రయత్నించాయని రాయల్ ఆస్ట్రోనామికల్ సొసైటీ జర్నల్‌లో ప్రచురితమైన కొత్త అధ్యయనం వెల్లడించింది. సూపర్నోవాగా మారకుండా బ్లాక్‌హోల్‌లో కూలిపోయింది.

‘స్థానిక విశ్వం యొక్క అత్యంత భారీ నక్షత్రాల్లో ఒకటి రాత్రికి సున్నితంగా వెళుతున్నట్లు మేం గుర్తించాం’ అని ట్రినిటీ కాలేజ్ డబ్లిన్‌లోని ఖగోళ శాస్త్రవేత్త జోస్ గ్రోహ్ పేర్కొన్నారు. 'ఒకవేళ నిజమైతే, ఈ విధంగా ఒక పెద్ద తార తన జీవితాన్ని ముగించడం ఇదే మొదటి ప్రత్యక్ష గుర్తింపు' అని ట్రినిటీ కాలేజీకి చెందిన అధ్యయన ప్రధాన రచయిత ఆండ్రూ అలాన్ పేర్కొన్నారు. భూమికి సుమారు 75 మిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ నక్షత్రం 2001-2011 మధ్య ఖగోళ శాస్త్రజ్ఞలు విస్తృతంగా దీనిపై అధ్యయనం చేశారు.

ఇలాంటి నక్షత్రాలు అరుదుగా ఉన్నాయని, ఇప్పటి వరకు విశ్వంలో కేవలం కొన్నింటినే ధ్రువపరుచబడ్డాయని నిపుణులు చెబుతున్నారు. 2019లో ఈ నక్షత్రపు పరిణామాన్ని తెలుసుకోవడానికి యూరోపియన్ సదరన్ అబ్జర్వేటరీకి చెందిన వెరీలార్జ్ టెలిస్కోప్‌ను ఉపయోగించాలని అలెన్, అతని సహచరులు అనుకున్నారట. కానీ ఆ నక్షత్రం అదృశ్యమైపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాగా, నక్షత్రం అదృశ్యమైనప్పుడు ఎలాంటి రేడియేషన్‌ లేదని అలెన్‌, ఆయన సహోద్యోగులు కనుగొన్నారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo