కన్నడ స్టార్ డైరక్టర్ ప్రశాంత్ నీల్ ఎప్పటికప్పుడు అప్ డేట్ లో ఉంటాడు. స్టార్ హీరోలతో చేస్తోన్న సినిమాల గురించి అభిమానులకు అప్ డేట్ ఇస్తాడు. ఇప్పుడలానే ప్రభాస్ ఫ్యాన్స్ కి అడక్కుండానే సలార్ సినిమా గురించి ఇంట్రస్టింగ్ విషయాన్ని చెప్పాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న సలాక్ సినిమా మ్యూజిక్ పనులు మొదలయ్యాయని తెలిపాడు.
ఇక యష్ అభిమానులకు కూడా కెజిఎఫ్ 2 సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల గురించి క్లారిటీ ఇచ్చాడు. రీ రికార్డింగ్ పనులు జరుగుతున్నాయని తెలిపాడు. సంగీత దర్శకుడు బాసూర్ రవి అటు సలార్ మ్యూజిక్ పనులను ఇటు కెజిఎఫ్ 2 రీ రికార్డింగ్ వర్క్ ని షెడ్యూల్ ప్రకారం పూర్తి చేస్తున్నాడని తెలిపాడు. అంతేకాదు రవితో పాటు స్టూడియో దగ్గర దిగిన ఫోటోని షేర్ చేశాడు.