కరోనాతో పోటీ పడి మరీ పవన్ కళ్యాణ్ సినిమా మంచి వసూళ్లు తీసుకొస్తుంది. ఈయన సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చి దాదాపు ఏడేళ్లైపోయింది. అప్పుడెప్పుడో అత్తారింటికి దారేది తర్వాత ఇప్పటి వరకు ఈయన చేసిన సినిమాలేవీ కూడా పాజిటివ్ టాక్ దక్కించుకోలేదు. సోసో టాక్ తోనే రచ్చ చేసాడు పవర్ స్టార్. అలాంటిది ఈయన సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే ఎలా ఉంటుంది..? ఇప్పుడు వకీల్ సాబ్ సినిమా కలెక్షన్స్ చూస్తుంటే ఇది అర్థమవుతుంది. 5 రోజుల్లోనే 73 కోట్ల షేర్ చేరువగా వచ్చింది వకీల్ సాబ్. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని శ్రీరామ్ వేణు తెరకెక్కించాడు.
అంజలి, అనన్య, నివేదా థామస్ కీలక పాత్రల్లో నటించారు. శృతి హాసన్ చిన్న పాత్రలో మెరిసింది. పింక్ సినిమా కథను పవన్ ఇమేజ్ కు తగ్గట్లు మార్చి చాలా బాగా తీర్చిదిద్ధాడు శ్రీరామ్ వేణు. పవన్ కళ్యాణ్ అభిమానులే కాదు బయటి ఆడియన్స్ కూడా వకీల్ సాబ్ సినిమాను మెచ్చుకుంటున్నారు. ఫస్టాఫ్ కాస్త యావరేజ్ గానే ఉన్నా సెకండాఫ్ సినిమాను నిలబెట్టింది. ముఖ్యంగా స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుండటంతో వకీల్ సాబ్ రచ్చ చేస్తున్నాడు. ఈ సినిమా 5 డేస్ ఏరియా వైజ్ వసూళ్ల లెక్కలు ఇప్పుడు చూద్దాం..
నైజాం- 20.46 కోట్లు
సీడెడ్- 10.74 కోట్లు
ఉత్తరాంధ్ర- 9.78 కోట్లు
ఈస్ట్- 5.47 కోట్లు
వెస్ట్- 6.26 కోట్లు
గుంటూరు- 6.18 కోట్లు
కృష్ణా- 4.17 కోట్లు
నెల్లూరు- 2.91 కోట్లు
ఏపీ + తెలంగాణ (టోటల్)- 66.02 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా- 3.48 కోట్లు
ఓవర్సీస్- 3.61 కోట్లు
వరల్డ్ వైడ్ (టోటల్)- 73.02 కోట్లు షేర్
వకీల్ సాబ్ సినిమా 89 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం 90 కోట్లు షేర్ వసూలు చేయాలి. ఇప్పటికే 73 కోట్ల షేర్ వసూలు చేసింది వకీల్ సాబ్. అంటే మరో 17 కోట్లు రావాలన్నమాట. కొత్త సినిమాలు ఏవీ లేకపోవడంతో రెండో వారాంతం కూడా పవన్ కళ్యాణ్ హవా కనిపించడం ఖాయంగా కనిపిస్తుంది. కచ్చితంగా బ్రేక్ ఈవెన్ సాధించేలా కనిపిస్తుంది వకీల్ సాబ్.
చెన్నై బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న ధనుష్..!
అమితాబ్ తో సినిమా చేస్తున్నానంటే నమ్మలేదు: రష్మ…
చీరలో రుక్మిణి స్టంట్స్ వీడియో వైరల్
సలార్, కెజిఎఫ్ 2లపై అప్ డేట్
కిల్లింగ్ లుక్స్‌తో చంపేస్తున్న ఇస్మార్ట్ బ్యూటీ
మురుగదాస్ పాన్ ఇండియా సినిమా..!
పవన్ సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్డేట్
బాక్సింగ్ రింగ్‌లోకి వరుణ్‌తేజ్
ఇంట్రెస్టింగ్గా ఉన్న ఖిలాడి టీజర్