Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
Dushyant Kumar Gautam | బీజేపీ సీనియర్ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను సిక్కిం గవర్నర్‌గా నియమించడాన్ని ఆ రాష్ట్ర ప్రజలు, విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఒక యువతి హత్య కేసులో ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సీబీఐ విచారణ పూర్తయ్యే వరకు గవర్నర్‌గా ఆయన నియామకాన్ని కేంద్రం నిలిపివేయాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు.
గ్యాంగ్‌టక్ : బీజేపీ సీనియర్ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను సిక్కిం గవర్నర్‌గా నియమించడాన్ని ఆ రాష్ట్ర ప్రజలు, విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఒక యువతి హత్య కేసులో ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సీబీఐ విచారణ పూర్తయ్యే వరకు గవర్నర్‌గా ఆయన నియామకాన్ని కేంద్రం నిలిపివేయాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు. (Dushyant Kumar Gauta) 2022లో ఉత్తరాఖండ్‌కు చెందిన అంకితా భండారి హత్యకు గురైంది. ఈ కేసులో ‘వీఐపీ’ ప్రమేయం ఉందన్న ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు చేస్తున్నది.
కాగా, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి దుష్యంత్ కుమార్ గౌతమ్ పేరు ఈ కేసు ఛార్జ్‌షీట్‌లో లేదు. అయినప్పటికీ ఈ కేసులో పేర్కొన్న ‘వీఐపీ’ ఆయనేనని అంకితా భండారి తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆయనను సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై ఉత్తరాఖండ్, ఢిల్లీతో పాటు సిక్కింలో కూడా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు సిక్కిం రాజధాని గ్యాంగ్‌టక్‌లో విద్యార్థులు, ప్రజలు నిరసనను తీవ్రం చేశారు. దుష్యంత్ కుమార్ గౌతమ్ తమ రాష్ట్రానికి గవర్నర్‌గా ఉండటంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని నిరసనకారులు తెలిపారు. అయితే కేసు విచారణలో ఉన్నంత కాలం లేదా ఆయనకు క్లీన్ చిట్ లభించే వరకు ఆ పదవిలో ఆయనను నియమించకూడదని, ఇదే తమ డిమాండ్ అని స్పష్టం చేశారు. ‘ఒకవేళ ఆయన నిర్దోషి అని తేలితే, క్షమాపణలు చెప్పడానికి మేం సిద్ధంగా ఉన్నాం. కానీ అప్పటి వరకు ఆయనను నియమించకూడదు’ అని ఒక నిరసనకారుడు పేర్కొన్నారు.
అయితే ఈ నిరసనలో పాల్గొన్నవారు పౌరులని, ఎలాంటి రాజకీయ అనుబంధం లేకుండానే వారంతా ఏకమయ్యారని నిరసన కార్యక్రమ నిర్వాహకురాలైన అంజలి తెలిపారు. చాలా మంది నిరసనలో పాల్గొనేందుకు సుముఖంగా ఉన్నట్లు చెప్పారు. తమ డిమాండ్‌ను కాదని దుష్యంత్ కుమార్ గౌతమ్ గవర్నర్ బాధ్యతలు చేపడితే నిరసనలను ఉధృతం చేస్తామని ఆమె అన్నారు. అయితే అక్టోబర్ 19న సిక్కిం గవర్నర్‌గా ఆయన ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

