కాంగ్రెస్‌కు సమాజ్‌వాదీ పార్టీ షాక్
వచ్చే ఏడాది జరుగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) తొలి విడతగా ఐదుగురు అభ్యర్థులతో జాబితాను విడుదల చేసింది. అయితే ఈ ఐదింటిలో రెండు సీట్లను కాంగ్రెస్ కూడా కోరుతున్నట్టు సమాచారం. సీట్ల పంపకంపై ఇరుపార్టీల మధ్య చర్చలు కొనసాగుతున్న సమయంలోనే ఈ ప్రకటన రావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
- సీట్ల సర్దుబాటుపై చర్చలు సాగుతుండగానే తొలి జాబితా
లక్నో: వచ్చే ఏడాది జరుగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) తొలి విడతగా ఐదుగురు అభ్యర్థులతో జాబితాను విడుదల చేసింది. అయితే ఈ ఐదింటిలో రెండు సీట్లను కాంగ్రెస్ కూడా కోరుతున్నట్టు సమాచారం. సీట్ల పంపకంపై ఇరుపార్టీల మధ్య చర్చలు కొనసాగుతున్న సమయంలోనే ఈ ప్రకటన రావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. 403 అసెంబ్లీ స్థానాలున్న ఉత్తరప్రదేశ్‌లో ఎవరెన్ని సీట్లలో పోటీచేయాలన్న దానిపై ఎస్పీ, కాంగ్రెస్ మధ్య ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదు. తమకు కనీసం 100 స్థానాలు కేటాయించాలని కాంగ్రెస్ పట్టుబడుతున్నట్టు సమాచారం. తొలుత 181 స్థానాలు కోరిన కాంగ్రెస్.. అనంతరం సుమారు 130 నియోకవర్గాలతో కూడిన జాబితాను ఎస్పీకి అందజేసింది. అయితే కాంగ్రెస్‌కు 26 స్థానాలు కేటాయించేందుకు ప్రతిపాదించినట్టు ఎస్పీ నేత రామ్‌గోపాల్ యాదవ్ తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 10 వేలకుపైగా ఓట్లు వచ్చిన నియోజకవర్గాలకు ఈ జాబితాలో ప్రాధాన్యం ఇచ్చినట్టు చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

