న్యాయవాది హాజరుకాలేదంటూ క్రిమినల్ అప్పీలును కొట్టివేయరాదు
నిందితుడు, అతని తరఫు న్యాయవాది హాజరుకాలేదన్న కారణంతో కింది కో ర్టులు క్రిమినల్ అప్పీళ్లను కొట్టివేయరాదని హైకోర్టు స్పష్టం చేసింది. ఆ అప్పీళ్లను విచారణకు స్వీకరించాక కేసులోని మెరిట్స్ ఆధారం గా కోర్టులు నిర్ణయం వెలువరించాలని,
- కింది కోర్టులకు హైకోర్టు స్పష్టీకరణ
హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ) : నిందితుడు, అతని తరఫు న్యాయవాది హాజరుకాలేదన్న కారణంతో కింది కో ర్టులు క్రిమినల్ అప్పీళ్లను కొట్టివేయరాదని హైకోర్టు స్పష్టం చేసింది. ఆ అప్పీళ్లను విచారణకు స్వీకరించాక కేసులోని మెరిట్స్ ఆధారం గా కోర్టులు నిర్ణయం వెలువరించాలని, ఒకవేళ నిందితుడు, అతని తరఫు న్యాయవాది గై ర్హాజరైనపుడు అవసరమైతే అమికస్ క్యూరీని నియమించుకోవాల్సిన అవసరం ఉన్నదని తేల్చిచెప్పింది. వివరాల్లోకి వెళ్తే.. క్రిమినల్ కేసులో తనకు రూ.10 వేల జరిమానా శిక్ష విధిస్తూ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఇచ్చిన తీర్పుపై సికింద్రాబాద్‌కు చెందిన ఎలక్ట్రో హోమియోపతి వైద్యుడు ఖుర్షీద్ అ న్వర్ భక్షి అప్పీలు దాఖలు చేశారు.
దీనిపై విచారణ జరిపిన అదనపు సెషన్స్ జడ్జి తన షరతుల ప్రకారం నిందితుడు, అతని తరఫు న్యాయవాది హాజరుకాలేదన్న కారణంతో ఆ అప్పీలు ను కొట్టివేశారు. దీన్ని సవాలు చేస్తూ ఖుర్షీద్ అన్వర్ భక్షి హైకోర్టులో దాఖలు చేసిన అప్పీలుపై ఇటీవల విచారం చేపట్టిన జస్టిస్ జే శ్రీనివాసరావు అదనపు సెషన్స్ జడ్జి ఉత్తర్వులను రద్దు చేశారు. ఖుర్షీద్ అన్వర్ భక్షి అప్పీలులోని రికార్డులు, పూర్వాపరాలను పరిశీలించి తిరిగి నిర్ణయం తీసుకోవాలని అదనపు సెషన్స్ జడ్జిని ఆదేశిస్తూ తీర్పు వెలువరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

