వనస్థలిపురంలో భారీ చోరీ
వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని కమలానగర్ కాలనీలో భారీ చోరీ జరిగింది. ఇంటికి వేసిన తాళం పగులగొట్టి చొరబడిన దుండగులు 30తులాల బంగారం, 4కిలోల వెండిని దొంగిలించారు. పోలీసుల వివరాల ప్రకారం.. విశ్రాంత ఉద్యోగి మండలిక సాయి సత్యనారాయణ కుటుంబంతో కలిసి కమలానగర్లో నివసిస్తున్నాడు.
- 30తులాల బంగారం, 4కేజీల వెండి అపహరణ
వనస్థలిపురం, నవంబర్ 24 : వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని కమలానగర్ కాలనీలో భారీ చోరీ జరిగింది. ఇంటికి వేసిన తాళం పగులగొట్టి చొరబడిన దుండగులు 30తులాల బంగారం, 4కిలోల వెండిని దొంగిలించారు. పోలీసుల వివరాల ప్రకారం.. విశ్రాంత ఉద్యోగి మండలిక సాయి సత్యనారాయణ కుటుంబంతో కలిసి కమలానగర్లో నివసిస్తున్నాడు. తన భార్యకు ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో నగరంలోని ఏఐజీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఆదివారం దవాఖానకు వెళ్లి సోమవారం ఇంటికి తిరిగి వచ్చాడు. తాళం పగులగొట్టి ఉండడంతో లోపలికి వెళ్లి చూడగా వస్తువులు చిందరవందరగా పడిఉన్నాయి. బీరువా తెరిచి ఉంది. ఇంట్లో నగలు, విలువైన వస్తువులు కనిపించలేదు. అందులో 4జతల గాజులు, ఒక నక్లెస్, పెద్ద గొలుసు, నల్లపూసల గొలుసు, పగడాల దండ, ముత్యాల గొలుసు, మంగళ సూత్రం గొలుసు, చెవి కమ్మలు, మాటీలు, 4 ఉంగరాలు ఉన్నాయి. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

