YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించేలా కేంద్ర బలగాలను రప్పించాలని వైసీపీ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరింది.
అమరావతి : ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించేలా కేంద్ర బలగాలను ( Central Forces) రప్పించాలని వైసీపీ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి ( YS Jagan) ఆధ్వర్యంలో ఎస్ఈసీ ( SEC ) కి ఆదివారం వినతి పత్రాన్నిఅందజేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడుగడుగునా అడ్డుకుంటున్నారని ఫిర్యాదు చేశారు.
పోలీసులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. తమ అభ్యర్తులకు పోలీసు బందోబస్తు కల్పించాలని కోరారు. టీడీపీ అభ్యర్థులు వందలాది మంది నామినేషన్లు కేంద్రాలకు వస్తున్నా వారిని పట్టించుకోకుండా వైసీపీ అభ్యర్థులను అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు. ఎన్నికలు సజావుగా, సాఫీగా జరిగేలా కేంద్ర బలగాలను దింపాలని కోరామని, ఆదివారం సాయంత్రం గవర్నర్ను కలిసి ఇదే విషయాన్ని కోరనున్నామని వెల్లడించారు. స్వేచ్చగా, పారదర్శకంగా ఎన్నికలు జరుపకపోతే ఎస్ఈసీకి చెడ్డ పేరు వస్తుందని చెప్పామని తెలిపారు.
నామినేషన్ కేంద్రాలు, పోలింగ్, స్ట్రాంగ్ రూంలు, కౌంటింగ్ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి లైవ్ ఫుటేజ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు హయాంలో ఎన్నికలు పారదర్శకంగా జరగవని తమకు అపనమ్మకం ఉందని పేర్కొన్నారు. ప్రజా స్వామ్యంలో ప్రజలు స్వేచ్ఛగా ఓటు వినియోగించుకోవడం , నామినేషన్లు వేయడం. పోటీ చేసే హక్కును పరిరక్షించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘాలనికి ఉందని వివరించారు.
అయితే రాష్ట్రంలోని పోలీసులు చంద్రబాబుకు వాచ్మెన్గా పనిచేస్తున్నారని, పోలీసు వ్యవస్థ మాఫియాగా ఏర్పడి చంద్రబాబుకు అన్ని రకాలుగా సహకరిస్తున్నారని విమర్శిం చారు. వైసీపీ హయాంలో ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించిన ఘనత ఉందని గుర్తు చేశారు. తాము విద్యా, వైద్యంతోపాటు అన్ని కోణాల్లోనూ ప్రజల్లో మార్పు తీసుకువచ్చామని, చంద్రబాబు హయాంలో అన్ని మోసాలేనని, అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అవుతున్నాయని ఆరోపించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

