e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 16, 2021
Home News చీర‌లో రుక్మిణి స్టంట్స్ వీడియో వైర‌ల్

చీర‌లో రుక్మిణి స్టంట్స్ వీడియో వైర‌ల్

చీర‌లో రుక్మిణి స్టంట్స్ వీడియో వైర‌ల్

రుక్మిణి విజ‌య‌కుమార్..భ‌ర‌త‌నాట్యం డ్యాన్స‌ర్ గా, న‌టిగా చాలా మందికి సుప‌రిచితురాలు.
బెంగ‌ళూరుకు చెందిన ఈ బ్యూటీ తాజాగా సారీలో జిమ్నాస్టిక్స్ చేస్తున్న వీడియో ఇపుడు నెట్టింట్లో చ‌క్క‌ర్లు కొడుతోంది. స్పిట్స్, బ్లాక్ ప్లిప్, హెడ్ స్టాండ్‌తోపాటు మ‌రిన్ని యోగా స్టంట్స్ వేసింది. ప్ర‌పంచ‌యోగా దినోత్స‌వం సంద‌ర్బంగా గ‌తేడాది డైరెక్ట్ చేసిన వీడియోలో నుంచి ఒక‌టి.. న‌మామి యోగా విద్యే అంటూ క్యాప్ష‌న్ ఇచ్చింది.

ఈ వీడియోను 6.5 ల‌క్షల మందికి పైగా వీక్షించ‌గా..వేల సంఖ్య‌లో కామెంట్లు, లైక్స్ వ‌చ్చాయి. చీర‌క‌ట్టులో వీరనారిలా స్టంట్స్ చేస్తున్న వీడియో నెటిజ‌న్ల‌ను అమితంగా ఆక‌ట్టుకుంటోంది. రుక్మిణి రాధాక‌ల్ప డ్యాన్స్ కంపెనీ ఆర్టిస్టిక్ డైరెక్ట‌ర్‌గా వ్య‌వ‌రిస్తోంది. రుక్మిణి ఇండియ‌న్ క్లాసిక‌ల్ డ్యాన్స్ లో ప్ర‌ధానంగా భ‌ర‌త‌నాట్యంలో శిక్ష‌ణ కోసం ఉప‌యోగ‌ప‌డే ది రాధా క‌ల్ప మెథ‌డ్‌ను స్థాపించింది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
చీర‌లో రుక్మిణి స్టంట్స్ వీడియో వైర‌ల్

ట్రెండింగ్‌

Advertisement