Padma Devender Reddy | చిన్నశంకరంపేట, జూన్ 02 : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి తెలిపారు. సోమవారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకొని చిన్నశంకరంపేటలోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా పద్మాదేవేందర్రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ సబ్బండ వర్గాలను ఏకం చేసి 14 ఏండ్ల సుదీర్ఘ పోరాటం చేసి ఢిల్లీ పెద్దల తలవంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని తెలిపారు. కేసీఆర్కు రెండుసార్లు ప్రజలు అవకాశం ఇస్తే దేశంలోనే నెంబర్వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దారని తెలిపారు. గత 10 ఏండ్లలో కేసీఆర్ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరిచారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏడాదిన్నర పాలనలో అన్ని రంగాలలో ఘోరంగా విఫలమైందని ఆరోపించారు.
గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడిందన్నారు. గ్రామాల్లో పరిశుభ్రత లోపించి సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందన్నారు. వెంటనే ప్రభుత్వం గ్రామాలను అభివృద్ధి పరిచి సీజనల్ వ్యాధులు రాకుండా చూడాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ రైతుల సంక్షేమం కోసం వ్యవసాయ రంగానికి నిరంతరంగా 24గంటల ఉచిత కరెంటు అందించాలని తెలిపారు. ఇప్పుడు కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు.
వర్షాకాలానికి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రైతు భరోసా డబ్బులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షుడు రాజు, జిల్లా నాయకుడు లక్ష్మారెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ సత్యనారాయణగౌడ్ మండలంలోని వివిధ గ్రామాల మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Medak | ఉద్యోగ, ఉపాధ్యాయుల హామీలను ప్రభుత్వం నెరవేర్చాలి: టీజీసీపీఎస్ ఈయూ నేత నర్సింహులు
Textbooks | పాపన్నపేట మండలంలో పాఠ్య పుస్తకాలు పంపిణీ చేసిన ఎంఈవో ప్రతాప్ రెడ్డి