పాపన్నపేట, జూన్ 2 : పాపన్నపేట మండల పరిధిలోని వివిధ పాఠశాలలకు పుస్తకాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పాపన్నపేట ఉన్నత పాఠశాలలో మండల విద్యాధికారి ప్రతాప్‌రెడ్డి, పాపన్నపేట ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మహేశ్వర్ కు పుస్తకాలు అందించి పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
మండలంలో ఉన్నత, ప్రాథమికోన్నత ప్రాథమిక పాఠశాలలో 62 ఉన్నాయని వీటికి ప్రస్తుతం 24 వేల పుస్తకాలను ప్రభుత్వం పంపిణీ చేసిందని మండల విద్యాధికారి వెల్లడించారు. మరో రెండు వేల పుస్తకాలు అందితే మొత్తం విద్యార్థులకు సరిపడిన పుస్తకాలు అందినట్లు అవుతుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో మండల వనరుల కేంద్రం సిబ్బంది నవాజ్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, రాజశేఖర్, ఎగొండ ఉన్నారు.