బుధవారం 02 డిసెంబర్ 2020
Peddapalli - Aug 16, 2020 , 01:54:05

జెండా ఊంఛా రహే హమారా

జెండా ఊంఛా రహే హమారా

హుజూరాబాద్‌/ఇల్లందకుంట/హుజూరాబాద్‌రూరల్‌/  జమ్మికుంట/సైదాపూర్‌/వీణవంక/హుజూరాబాద్‌టౌన్‌ :నియోజకవర్గంలో 74వ స్వాతంత్య్రం దిన వేడుకలు  ఘనంగా నిర్వహించారు. ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీవో చెన్నయ్య, ఏసీపీ కార్యాలయంలో ఏసీపీ శ్రీనివాస్‌రావు, ఏడీఏ కార్యాలయంలో ఏడీఏ ఆదిరెడ్డి, ఎంవీఐ కార్యాలయంలో ఎంవీఐ ఈశ్వర్‌సింగ్‌, ఐసీడీఎస్‌లో సీడీపీవో శారద, ట్రాన్స్‌కో కార్యాలయంలో డీఈ మాధవ రెడ్డి, నీటిపారుదలశాఖలో డీఈ శ్రీనివాసులు, సింగిల్‌ విండో కార్యాలయంలో అధ్యక్షుడు కొండల్‌ రెడ్డి జెండాలు ఆవిష్కరించారు. హుజూరాబాద్‌ మండలంలోని అన్ని గ్రామాల్లో సర్పంచులు, తుమ్మనలపల్లి, జూపాక, హుజూరాబాద్‌ సింగిల్‌ విండో కార్యాలయాల్లో చైర్మన్లు సుగుణాకర్‌రెడ్డి, శ్యాంసుందర్‌రెడ్డి, కొండల్‌రెడ్డి జెండాలు ఎగురవేశారు. సింగాపూర్‌ కిట్స్‌ కళాశాలలో ప్రిన్సిపాల్‌ శంకర్‌, తుమ్మనపల్లి ఏకశిల పాఠశాలలో వైస్‌ ప్రిన్సిపాల్‌ లక్ష్మణ్‌ జెండాలు ఆవిష్కరించారు. ఇల్లందకుంట   తహసీల్‌ కార్యాలయంలో సురేఖ, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ పావని, పోలీస్‌ సేష్టన్‌లో సతీశ్‌,  సీతారామచంద్రస్వామి ఆలయంలో  ఈవో సుధాకర్‌, ఏవో కార్యాలయంలో రజిత, జెండాలు ఆవిష్కరించారు.

జమ్మికుంట పోలీస్‌ స్టేషన్‌లో సీఐ సృజన్‌రెడ్డి, మున్సిపల్‌ కార్యాలయం, తెలంగాణ చౌక్‌ వద్ద మున్సిపల్‌ చైర్మన్‌ రాజేశ్వర్‌రావు, తహసీల్‌ కార్యాలయలో తహసీల్దార్‌ నారాయణ, మండల పరిషత్‌లో ఎంపీపీ మమత,  మార్కెట్‌ కమిటీలో చైర్‌పర్సన్‌ శారద, వ్యవసాయశాఖ కార్యాలయంలో ఏవో గోవర్ధన్‌రెడ్డి, ఎమ్మార్సీలో ఎంఈవో శ్రీనివాస్‌, పీఏసీఎస్‌లో సంపత్‌, ఎక్సైజ్‌ కార్యాలయంలో సీఐ అక్బర్‌హుస్సేన్‌, జాతీయ జెండాలు ఆవిష్కరించారు. సైదాపూర్‌ తహసీల్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ సురేశ్‌కుమార్‌, మండలకేంద్రంలో ఎంపీపీ  ప్రభాకర్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ శ్రీధర్‌రెడ్డి, సింగిల్‌విండో కార్యాలయాల వద్ద చైర్మన్‌లుతిరుపతిరెడ్డి, వెంకటరెడ్డి, తెలంగాణతల్లి విగ్రహం వద్ద టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు  రాజయ్య, పోలీస్‌ష్టేషన్‌లో ఎస్‌ఐ ప్రశాంతరావు జెండాలు ఎగురవేశారు. వీణవంక తహసీల్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ కృష్ణచైతన్య, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ రేణుక, పీఏసీఎస్‌ కార్యాలయంలో చైర్మన్‌ విజయభాస్కర్‌రెడ్డి, పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐ కిరణ్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ కార్యాలయంలో మండలాధ్యక్షుడు కొమురయ్య జెండాలు ఆవిష్కరించారు. హుజూరాబాద్‌ మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ రాణి, మున్సిపల్‌ కార్యాలయంలో చైర్‌పర్సన్‌ రాధిక, లేబర్‌ కార్యాలయం వద్ద వైస్‌ చైర్‌పర్సన్‌ నిర్మల, కార్మికశాఖ కార్యాలయం వద్ద ఏఎల్‌వో వెంగమాంబ, పోలీస్‌స్టేషన్‌లో టౌన్‌ సీఐ మాధవి, తహసీల్‌ కార్యాలయం వద్ద తహసీల్దార్‌ బావుసింగ్‌, ఏరియా దవాఖానలో సూపరింటెండెంట్‌ ప్రవీణ్‌రెడ్డి, మార్కెట్‌ కార్యాలయంలో చైర్మన్‌  శ్రీనివాస్‌, హుజూరాబాద్‌ కోర్టులో జడ్జి రాధిక, ఏడీఏ కార్యాలయంలో ఏడీఏ ఆదిరెడ్డి, ఎంవీఐ ఠాకూర్‌ ఈశ్వర్‌సింగ్‌, ఐసీడీఎస్‌ సీడీపీవో శారద, ఆర్టీసీ డిపో మేనేజర్‌ రాజ్యలక్ష్మి, సబ్‌రిజిస్ట్రార్‌ జావిద్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ డీఈ నర్సింహారెడ్డి, వెటర్నరీ ఏడీఏ శ్రీనివాస్‌, జైలర్‌ ఉపేందర్‌రావు, మంత్రి కార్యాలయంలో పీఏ నరేందర్‌, ఎన్‌పీడీసీఎల్‌ డీఈ వాసుదేవ్‌, డిప్యూటీ డీఎంహెచ్‌వో కార్యాలయంలో డాక్టర్‌ జువేరియా, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కళాధర్‌, టీఆర్‌ఎస్‌ కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్‌, కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం వద్ద అధ్యక్షుడు మహేందర్‌గౌడ్‌, బీజేపీ కార్యాలయంలో అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, సీఐటీయూ కార్యాలయం వద్ద అధ్యక్షుడు శ్రీనివాస్‌ జెండాలు ఎగురవేశారు. హుజూరాబాద్‌ ఏరియా దవాఖానలో 125 కేవీ పెద్ద జనరేటర్‌ను మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రాధిక, వైస్‌ చైర్‌పర్సన్‌ నిర్మల, ఎంపీపీ రాణి, జడ్పీటీసీ బక్కారెడ్డి ప్రారంభించి జాతికి అంకితం చేశారు. డాక్టర్‌ అమృత్‌ రాసిన ‘కలం కనే కలలు’ పుస్తకాన్ని ప్రజాప్రతినిధులు ఆవిష్కరించారు. ఉత్తమ సేవలు అందించిన మున్సిపల్‌, దవాఖాన పారిశుద్ధ్య కార్మికులలు, సెక్యూరిటీ గార్డులను సన్మానించారు.