e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 18, 2021
Home News క్రికెట్ దేవుడు పుట్టాడీరోజే.. చ‌రిత్ర‌లో ఈరోజు

క్రికెట్ దేవుడు పుట్టాడీరోజే.. చ‌రిత్ర‌లో ఈరోజు

క్రికెట్ దేవుడు పుట్టాడీరోజే.. చ‌రిత్ర‌లో ఈరోజు

క్రికెట్ దేవుడిగా ముద్దుగా పిలుచుకునే స‌చిన్ టెండూల్క‌ర్ ముంబైలోని మరాఠీ కుటుంబంలో 1973 ఏప్రిల్ నెల‌లో ఇవాళే జన్మించాడు. తండ్రి ర‌మేశ్‌ సంగీతకారుడు సచిన్ దేవ్ బర్మన్‌ను ప్రేమిస్తున్నందున సచిన్ అని పేరు పెట్టారు. చిన్న వ‌య‌సులో సచిన్ చూపుతున్న క్రికెట్ ప్రతిభకు రమాకాంత్ అచ్రేకర్ స‌ల‌హాలు కూడా తోడ‌వడంతో స‌చిన్ మ‌రింత రాటుదేలాడు.

సచిన్‌కు బౌలింగ్ అంటే కూడా ఇష్టం. అతను బ్యాట్స్ మాన్ కావడానికి ముందు ఫాస్ట్ బౌలర్ అవ్వాలనుకున్నాడు. అతను బౌలింగ్ నేర్చుకోవడానికి ఒక శిక్షణా శిబిరానికి వెళ్లగా.. అక్కడ శిక్ష‌ణ ఇస్తున్న డెన్నిస్ లిల్లీ బ్యాటింగ్‌పై దృష్టి పెట్టాల‌ని స‌ల‌హా ఇచ్చాడు. ఆరోజు నుంచి బ్యాటింగ్ ప్రారంభించిన స‌చిన్‌.. 24 ఏండ్ల పాటు వెనుదిరిగి చూసుకోకుండా క్రికెట్ ఆడాడు.

పాఠశాలలో ఉన్నప్పుడు హరీష్ షీల్డ్ పోటీలో వినోద్ కాంబ్లీతో కలిసి 1988లో 644* పరుగుల పాట్నర్‌షిప్ రికార్డు సృష్టించాడు. ఆ ఇన్నింగ్సులో సచిన్ బౌలర్లపై విరుచుకుపడి పరుగుల వరద సాధించి 320 కి పైనా పరుగులు చేశాడు. ఆ టోర్నమెంట్ లో సచిన్ వెయ్యికి పైగా పరుగులు సాధించాడు.ఇక అప్ప‌టి నుంచి ప‌రుగుల ప్ర‌వాహం కొన‌సాగడం ప్రారంభ‌మైంది.

1988-89 లో అతడి మొట్టమొదటి ఫస్ట్ క్లాస్ క్రికెట్ ముంబాయి తరఫున ఆడుతూ గుజరాత్‌పై 100 (నాటౌట్) పరుగులు సాధించాడు. 15 సం.ల 232 రోజుల వయస్సులోనే ఫస్ట్ క్లాస్ సెంచరీ సాధించి ఆ ఘనతను సాధించిన యువ బ్యాట్స్‌మెన్ గా అవతరించాడు. అంతేకాకుండా రంజీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీ, ఇరానీ ట్రోఫీ లలో కూడా తను ఆడిన తొలి మ్యాచ్ లలోనే సెంచరీలు సాధించి ఆ ఘనతను పొందిన ఏకైక క్రికెటర్ గా రికార్డు సృష్టించాడు.

భారతదేశం తరఫున టెస్ట్ మ్యాచ్ ఆడటానికి సచిన్ 15 నవంబర్ 1989 న తొలిసారిగా మైదానంలోకి దిగాడు. ఆ సమయంలో అతడి వ‌య‌సు 16 సంవత్సరాలు. కరాచీలోని నేషనల్ స్టేడియంలో ఆడిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమ్ ఇండియా మొదట ఫీల్డింగ్ చేయాలని నిర్ణయించుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ మొదటి ఇన్నింగ్స్‌లో 409 పరుగులు చేసింది. దీనికి ప్రతిస్పందనగా టీమిండియా 262 పరుగులు చేసింది. సచిన్ కేవలం 15 పరుగులే చేశాడు. సచిన్‌ను అవుట్ చేసిన బౌలర్ కూడా తన మొదటి మ్యాచ్ ఆడుతున్నాడు. ఆ బౌలర్ పేరు వకార్ యూనిస్.

2013 నవంబర్ 15.. సచిన్ టెస్ట్ క్రికెట్ చివరి ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన ఈ టెస్టు మ్యాచ్‌లో సచిన్ 74 పరుగులు చేసి మైదానం నుంచి తిరిగి వచ్చాడు. మరుసటి రోజు అతను అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అయ్యాడు. దీంతో గొప్ప క్రికెటర్ 24 ఏళ్ల టెస్ట్ క్రికెట్ కెరీర్ ముగిసింది. ఈ సందర్భంలో భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను ఆయనకు ప్రకటించింది. ఈ విధంగా ఈ అవార్డును పొందిన ప్రథమ క్రీడాకారునిగా మరో రికార్డు నెలకొల్పాడు సచిన్ టెండూల్కర్.

స‌చిన్ రికార్డులు

క్రికెట్ దేవుడు పుట్టాడీరోజే.. చ‌రిత్ర‌లో ఈరోజు

వ‌న్డేల్లో అత్య‌ధిక సెంచరీలు (49) సాధించిన ఏకైక బ్యాట్స్‌మెన్‌
వ‌న్డేల్లో అత్య‌ధిక హాఫ్ సెంచ‌రీలు (96) సాధించిన బ్యాట్స్‌మెన్‌
అత్య‌ధిక వ‌న్డేలు (463) ఆడిన క్రికెట‌ర్‌
వ‌న్డేల్లో అత్య‌ధిక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌లు (62) పొందిన క్రికెట‌ర్‌
అత్య‌ధిక ప‌రుగులు సాధించిన బ్యాట్స్‌మెన్ (18,426)
ఒకే క్యాలండ‌ర్ ఇయ‌ర్‌లో ఏడు సార్లు వేయి ప‌రుగులు
ఒకే క్యాలండ‌ర్ ఇయ‌ర్‌లో అత్య‌ధిక ప‌రుగులు ( 1894)
ఒకే క్యాలండ‌ర్ ఇయ‌ర్‌లో అత్య‌ధిక సెంచ‌రీలు (9)
వన్డేల్లో తొలి డ‌బుల్ సెంచరీ
అత్య‌ధిక సార్లు 200 కు మించి పార్ట్‌న‌ర్‌షిప్‌ (6సార్లు) ప‌రుగులు
ఆస్ట్రేలియా, ద‌క్షిణాఫ్రికా, న్యూజీలాండ్‌, శ్రీ‌లంక‌, జింబాబ్వేల‌పై అత్య‌ధిక సెంచ‌రీలు
అతిపిన్న వ‌య‌సులో టెస్ట్ క్రికెట్ ఆడిన క్రికెట‌ర్‌
టెస్ట్ క్రికెట్‌లో అత్య‌ధిక సెంచ‌రీలు (51)
టెస్ట్ క్రికెట్‌లో అత్య‌ధిక హాఫ్ సెంచ‌రీలు (67)
టెస్టులు ఆడే అన్ని దేశాల‌పై సెంచ‌రీలు చేసిన తొలి భార‌త క్రికెట‌ర్‌
అత్య‌ధిక టెస్టులు (200) ఆడిన భార‌త క్రికెట‌ర్‌
టెస్ట్ క్రికెట్‌లో అత్య‌ధిక ప‌రుగులు (15,837) చేసిన బ్యాట్స్‌మెన్

అవార్డులు-రివార్డులు

క్రికెట్ దేవుడు పుట్టాడీరోజే.. చ‌రిత్ర‌లో ఈరోజు

1994 లో అర్జున
1997 లో రాజీవ్ ఖేల్ ర‌త్న
1997 లో విజ్డెన్ క్రికెట‌ర్ ‌
1999లో ప‌ద్మ‌శ్రీ
2008 లో ప‌ద్మ‌విభూష‌ణ్‌
2010 లో ఐసీసీ క్రికెట‌ర్ ఆఫ్ ది ఇయ‌ర్‌
2014 లో భార‌తర‌త్న‌
2020 లో లార‌స్ వ‌రల్డ్ స్పోర్ట్స్

మ‌రికొన్ని ముఖ్య సంఘ‌ట‌న‌లు..

2013: ఢాకాలో భవనం కూలి 1129 మంది దుర్మ‌ర‌ణం, 2500 మందికి పైగా గాయాలు

2005: రోమన్ కాథలిక్ చర్చి కొత్త నాయకుడిగా అధికారికంగా బాధ్యతలు స్వీకరించిన పోప్ బెనెడిక్ట్ XVI

1998: షార్జాలో ఆస్ట్రేలియాను ఆరు వికెట్ల తేడాతో ఓడించి కోకాకోలా కప్‌ను గెలుచుకున్న టీమిండియా

1990: భూమి కక్ష్యలోకి ప్రవేశపెట్టిన హబుల్ స్పేస్ టెలిస్కోప్

1974 : ప్ర‌ముఖ హిందీక‌వి రామ్‌ధారి సింగ్ దిన‌క‌ర్ మ‌ర‌ణం

1957: సూయజ్ సంక్షోభం తరువాత సూయజ్ కాలువ ప్రారంభం

1926: బెర్లిన్ ఒప్పందం

1815 : భార‌త్‌లో గోర్ఖా రెజిమెంట్‌ను ప్రారంభించిన ఈస్ట్ ఇండియా కంపెనీ

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
క్రికెట్ దేవుడు పుట్టాడీరోజే.. చ‌రిత్ర‌లో ఈరోజు

ట్రెండింగ్‌

Advertisement