మహారాష్ట్ర హోంశాఖ మాజీ మంత్రి ఇంట్లో సీబీఐ సోదాలు
మహారాష్ట్ర హోంశాఖ మాజీ మంత్రి | మహారాష్ట్రలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ హోంశాఖ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.

ముంబై : మహారాష్ట్రలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ హోంశాఖ మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అలాగే ఆయన నివాసంతో పాటు ముంబై, నాగ్‌పూర్‌లో పలు చోట్ల శనివారం ఉదయం తనిఖీలు నిర్వహించింది. నెలకు రూ.వంద కోట్లు వసూలు చేయాలంటూ తనపై ఒత్తిడి తీసుకొచ్చారని కొద్ది రోజుల ముంబై మాజీ కమిషనర్ పరమ్ బీర్ సింగ్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ ఆరోపణల నేపథ్యంలో ఈ కేసును సీబీఐకు అప్పగిస్తూ బాంబే హైకోర్టు ఇటీవలే సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి విధితమే. కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ అనిల్ దేశ్ముఖ్తో పాటు పలువురిపై ఏప్రిల్ 6న ప్రాథమిక విచారణ చేపట్టింది. ఇదిలా ఉండగా, ఏప్రిల్ 14న మాజీ హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్‌ను ఈ కేసులో విచారించిన విషయం విధితమే.
ముఖేష్ అంబానీ సెక్యూరిటీ స్కేర్ కేసులో దర్యాప్తులో ‘లోపాలు’ ఉన్నాయని బదిలీ అయిన పరమ్ బిర్ సింగ్, నాడు మంత్రిగా ఉన్న అనిల్ దేశ్ ముఖ్‌పై దోపిడీ, అక్రమ బదిలీలతో సహా పలు ఆరోపణలను సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. ఈ కేసులో సీబీఐ అధికారులు తమ ప్రాథమిక విచారణలో భాగంగా.. అవినీతి కేసుకు సంబంధించి అనిల్ దేశ్ ముఖ్ వ్యక్తిగత సహాయకులు, మాజీ పోలీస్ సచిన్ వాజే ఇద్దరు డ్రైవర్లు, బార్ యజమానులు, ముంబై పోలీస్ అధికారులు, మాజీ మంత్రికి సన్నిహిత వ్యక్తులను సైతం సీబీఐ ప్రశ్నించింది. తాజా పరిణామాలు మహారాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఓ వైపు కరోనా.. మరో వైపు అవినీతి ఆరోపణలు మహారాష్ట్ర సర్కారుకు తలనొప్పిగా మారాయి.
ఇవికూడా చదవండి..
జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ వినియోగానికి సీడీసీ అనుమతి
ఈ-ప్రాపర్టీ కార్డులు పంపిణీకి నేడు ప్రధాని శ్రీకారం
నేటి నుంచి శ్రీవారి ఆలయంలో సాలకట్ల వసంతోత్సవాలు
మయన్మార్‌లో ఆగని హింస.. ఇప్పటికీ 740 మంది బలి
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

