జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ వినియోగానికి సీడీసీ అనుమతి
జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ | అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) టీకా సలహా కమిటీ శుక్రవారం జాన్సన్ అండ్ జాన్సన్ కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీకి సిఫారసు చేసింది.

వాషింగ్టన్ : అమెరికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) టీకా సలహా కమిటీ శుక్రవారం జాన్సన్ అండ్ జాన్సన్ కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీకి సిఫారసు చేసింది. వ్యాక్సిన్ ప్రయోజనాలు నష్టాలను అధిగమిస్తాయని పేర్కొంది. ఇమ్యునైజేషన్ ప్రాక్టీసెస్‌పై సీడీసీ సలహా కమిటీ టీకా పునర్వినియోగానికి 10-4 ఓట్లు వేసింది. జేఅండ్‌జే వ్యాక్సిన్ వాడకానికి సంబంధించి చర్చించడానికి సీడీసీ ప్యానెల్ ఈ వారంలో శుక్రవారం రెండోసారి సమావేశమైంది. మహిళలు తమకు సౌకర్యవంతంగా ఉంటే, ప్రమాదాల గురించి తెలిస్తేనే టీకా తీసుకోవాలని సూచించింది. అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లను ఎంపిక చేసుకోవచ్చని ప్యానెల్ చెప్పింది.
వ్యాక్సిన్ తీసుకున్న మహిళల్లో అరుదుగా రక్తం గడ్డకట్టడంతో గతవారంలో టీకా పంపిణీ నిలిపివేసిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు అమెరికాలో 15 రక్తం గడ్డకట్టిన కేసులు నమోదయ్యాయి. ఇందులో 18-49 ఏళ్ల మధ్య వయస్సు గల మహిళల్లోనే 13 కేసులున్నాయి. పురుషులతో సహా అన్ని సంభావ్య కేసులపై ప్రస్తుతం సమీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపింది. వ్యాక్సిన్ అందుకున్న దాదాపు ఎనిమిది మిలియన్ల అమెరికన్లలో మూడు మరణాలు నమోదయ్యాయి. ఏడుగురు హాస్పిటల్లో చికిత్స పొందుతుండగా.. నలుగురు ఐసీయూలో ఉన్నారు.
ఇవికూడా చదవండి..
దేశంలో గుజరాత్ ఒక్కటే ఉందా?
ఆ చిన్నారిని కాపాడిన రైల్వే హీరోకు గిఫ్ట్‌గా ఖరీదైన బైక్
ఆక్సిజన్‌ను పెంచే వ్యాయామం
అమెరికన్లే మాకు ముఖ్యం!
డబుల్, ట్రిపుల్ మ్యుటెంట్ల మధ్య తేడా లేదు
మూడు ప్రభుత్వ ఉద్యోగాలు గెలిచి..
సొంత వైద్యం మానుకో!
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
Dandari festival | దండారి ఉత్సవాలు భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : బీఆర్ఎస్ ఇన్చార్జి భూక్యా జాన్సన్ నాయక్
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

