మయన్మార్‌లో ఆగని హింస.. ఇప్పటికే 740 మంది బలి
మయన్మార్‌లో ఆగని హింస | మయన్మార్‌లో హింస తీవ్రతరమవుతోంది. ఫిబ్రవరి 1న దేశాన్ని సైన్యం తమ ఆధీనంలోకి తీసుకున్న నాటి నుంచి ఈ నెల 23వ తేదీ వరకు 740 మంది మరణించినట్లు ఏఏపీపీ (అసిస్టెన్స్ అసోసియేసన్ ఫర్ పొలిటికల్ ప్రిజనర్స్) తెలిపింది.

నేపిట : మయన్మార్‌లో హింస తీవ్రతరమవుతోంది. ఫిబ్రవరి 1న దేశాన్ని సైన్యం తమ ఆధీనంలోకి తీసుకున్న నాటి నుంచి ఈ నెల 23వ తేదీ వరకు 740 మంది మరణించినట్లు ఏఏపీపీ (అసిస్టెన్స్ అసోసియేసన్ ఫర్ పొలిటికల్ ప్రిజనర్స్) తెలిపింది. 3,371 మంది ప్రస్తుతం నిర్బంధంలో ఉన్నారని తెలిపింది. యాంగోన్లోని సాంచాంగ్ టౌన్షిప్, ష్వేపైథార్ విచారణ కేంద్రం నుంచి విడుదలైన 17 ఏళ్ల బాలిక పట్ల నం.24 పోలీస్ స్టేషన్ సిబ్బంది దాడి చేయడంతో పాటు అసభ్యంగా ప్రవర్తిస్తూ తుపాకీతో బెదిరింపులకు పాల్పడ్డారని ఏఏపీపీ పేర్కొంది. యాంకిన్ టౌన్షిప్ నుంచి బాంబుదాడులకు సంబంధించి ఒకే విచారణ కేంద్రంలో అదుపులోకి తీసుకున్న మరో ఇద్దరు మహిళలను సైతం దారుణంగా చితకబాదారని తెలిపింది.
ఇందులో ఓ మహిళపై మెటల్ రాడ్డుతో దాడి చేశారని, మిలటరీ జుంటా మహిళా అధికారులను వినియోగించడం లేదని, విచారణ సమయంలో పురుష సైనికులను ఉపయోగిస్తోందని పేర్కొంది. ఇదిలా ఉండగా.. మయన్మార్ సీనియర్ జనరల్ మిన్ ఆంగ్ హ్లెయింగ్ శనివారం ఇండోనేషియా రాజధాని జకార్తాలో ఆసియన్ శిఖరాగ్ర సమావేశానికి హాజరుకానున్నారు. గత ఫిబ్రవరిలో మయన్మార్ సైన్యం పౌర ప్రభుత్వాన్ని కూల్చి, దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. అలాగే నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ (ఎన్ఎల్డీ) నాయకురాలు ఆంగ్ సాన్ సూకీతో పాటు దేశ అధ్యక్షుడు యు విన్‌మైంట్‌ను అదుపులోకి తీసుకుంది. దీంతో తిరిగి పౌర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటూ మయన్మార్ పౌరులు సైన్యంపై తిరుగుబాటు చేస్తున్నారు.
ఇవికూడా చదవండి..
దేశంలో గుజరాత్ ఒక్కటే ఉందా?
ఆ చిన్నారిని కాపాడిన రైల్వే హీరోకు గిఫ్ట్‌గా ఖరీదైన బైక్
ఆక్సిజన్‌ను పెంచే వ్యాయామం
అమెరికన్లే మాకు ముఖ్యం!
డబుల్, ట్రిపుల్ మ్యుటెంట్ల మధ్య తేడా లేదు
మూడు ప్రభుత్వ ఉద్యోగాలు గెలిచి..
సొంత వైద్యం మానుకో!
జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ వినియోగానికి సీడీసీ అనుమతి
ఈ-ప్రాపర్టీ కార్డులు పంపిణీకి నేడు ప్రధాని శ్రీకారం
నేటి నుంచి శ్రీవారి ఆలయంలో సాలకట్ల వసంతోత్సవాలు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

