నేటి నుంచి శ్రీవారి ఆలయంలో సాలకట్ల వసంతోత్సవాలు
సాలకట్ల వసంతోత్సవాలు | తిరుమల వేంకటేశ్వరస్వామి సన్నిధిలో నేటి నుంచి మూడు రోజుల పాటు సాలకట్ల వసంతోత్సవాలు జరుగనున్నాయి. కొవిడ్-19 నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలను ఆలయంలో ఏకాంతంగా నిర్వహించనుండగా.. ఉత్సవాల్లో భాగంగా రేపు జరగాల్సిన స్వర్ణ రథోత్సవాన్ని టీటీడీ రద్దు చేసింది.

తిరుమల : తిరుమల వేంకటేశ్వరస్వామి సన్నిధిలో నేటి నుంచి మూడు రోజుల పాటు సాలకట్ల వసంతోత్సవాలు జరుగనున్నాయి. కొవిడ్-19 నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలను ఆలయంలో ఏకాంతంగా నిర్వహించనుండగా.. ఉత్సవాల్లో భాగంగా రేపు జరగాల్సిన స్వర్ణ రథోత్సవాన్ని టీటీడీ రద్దు చేసింది. వసంత రుతువులో శ్రీ మలయప్పస్వామివారికి జరిగే ఈ ఉత్సవానికి ‘వసంతోత్సవ’మని పేరు ఏర్పడింది. ఈ క్రతువులో సుగంధ పుష్పాలను స్వామికి సమర్పించటమే కాక వివిధ ఫలాలను స్వామికి నివేదించనున్నారు.
ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పౌర్ణమికి ముగిసేటట్లుగా ఉత్సవాలు మూడు రోజుల పాటు జరుపడం ఆనవాయితీగా వస్తోంది. ఉత్సవాల్లో భాగంగా మూడు రోజుల పాటు మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు శ్రీవారి ఆలయంలోని కల్యాణమండపంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం నిర్వహించనున్నారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంతో అభిషేకం చేస్తారు. సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు ఆస్థానం, రాత్రి 7 గంటలకు స్వామి, అమ్మవార్లలను ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు.
మొదటి రెండు రోజులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి, మూడో రోజు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారితో పాటు శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి ఉత్సవర్లు, రుక్మిణి సమేత శ్రీకృష్ణస్వామి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం, ఊరేగింపు నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాల కారణంగా మూడు రోజుల పాటు కల్యాణం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది.
ఇవికూడా చదవండి..
దేశంలో గుజరాత్ ఒక్కటే ఉందా?
ఆ చిన్నారిని కాపాడిన రైల్వే హీరోకు గిఫ్ట్‌గా ఖరీదైన బైక్
ఆక్సిజన్‌ను పెంచే వ్యాయామం
అమెరికన్లే మాకు ముఖ్యం!
డబుల్, ట్రిపుల్ మ్యుటెంట్ల మధ్య తేడా లేదు
మూడు ప్రభుత్వ ఉద్యోగాలు గెలిచి..
సొంత వైద్యం మానుకో!
జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ వినియోగానికి సీడీసీ అనుమతి
ఈ-ప్రాపర్టీ కార్డులు పంపిణీకి నేడు ప్రధాని శ్రీకారం
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

