e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 23, 2021
Home News బీజేపీ, కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లో చేరికలు

బీజేపీ, కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లో చేరికలు

బీజేపీ, కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లో చేరికలు

నిజామాబాద్‌ : అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. తాజాగా జిల్లాలోని బాల్కొండ నియోజకవర్గానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకులు నాగంపేట్ ఉప సర్పంచ్ గోజూరు గణేష్, కాంగ్రెస్ పార్టీకి చెందిన వార్డు మెంబర్ ముత్తెన్న, బీజేపీ వార్డు మెంబర్ పద్మ గంగాధర్ పలువురు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో టిఆర్ఎస్ లో చేరారు.


మంత్రి వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..రైతు,పేదల సంక్షేమంలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకెళ్తుందన్నారు.


దేశవ్యాప్తంగా పంట కొనుగోలు కేంద్రాలు ఎత్తి వేస్తుంటే రాష్ట్రంలో మాత్రం ప్రతి గ్రామంలో పంట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు కేసీఆర్ భరోసానిచ్చారన్నారు. ఇది రైతు,పేదల పక్షపాతి ప్రభుత్వమని అన్నారు. కార్యక్రమంలో సామ వెంకట్ రెడ్డి,ఉమా శంకర్, ఎంపీటీసీ మోహన్ రెడ్డి, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

బీజేపీ, కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లో చేరికలు

ఇవి కూడా చదవండి..

రైతులు డిమాండ్‌ ఉన్న పంటలనే పండించాలి

బీచ్‌లో శ్ర‌ద్దాదాస్ షికార్లు‌..ఫొటోలు వైర‌ల్

త్వరలో టీఆర్‌ఎస్‌ కార్యాలయం ప్రారంభం : మంత్రి ఎర్రబెల్లి

మాస్క్ ధరించాలని పోలీసుల ప్రచారం

గిరిజన మహిళలను పారిశ్రామిక వేత్తలుగా మారుస్తున్న సీఎం కేసీఆర్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
బీజేపీ, కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్‌లో చేరికలు

ట్రెండింగ్‌

Advertisement