Geetha Workers | ఓదెల, ఆగస్ట్ 6 : పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలోని గీత కార్మికులకు ప్రభుత్వం అందిస్తున్న సేఫ్టీ మోగులను బుధవారం పంపిణీ చేశారు. రేణుక ఎల్లమ్మ తల్లి గుడి వద్ద గీత పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు నాగపురి రవి గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సేఫ్టీ మోకుల ట్రైనింగ్ నిర్వహించి ట్రైనింగ్ తీసుకున్న వారికి సేఫ్టీ మోకుల కిట్లు అందించారు.
గీత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం తగిన ప్రాధాన్యతను ఇస్తున్నట్లు పేర్కొన్నారు. తాటి చెట్లు ఎక్కే క్రమంలో గౌడన్నలు ప్రమాదాలకు గురికాకుండా ఉండేందుకే ప్రభుత్వం ఉచితంగా సేఫ్టీ మోకులను అందజేస్తున్నట్టు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి, ట్రైనర్స్ జాగిరి అంజి గౌడ్, వెంకటేష్ గౌడ్, గీత పారిశ్రామిక సహకార సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Motkur : తెలంగాణ ఉద్యమ వైతాళికుడు జయశంకర్ సార్ : దూళిపాల ధనుంజయ నాయుడు
Raj B Shetty | పెద్ద స్టార్లతో నటిస్తే ఇబ్బందులు పడాలి.. రాజ్ బీ శెట్టి కామెంట్స్ వైరల్
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటాలి : ఓరుగంటి రమణారావు