పెగడపల్లి : రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటాలని ఆ పార్టీ రాష్ట్ర నేత, పెగడపల్లి సహకార సంఘం చైర్మన్ ఓరుగంటి రమణారావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపు మేరకు బుధవారం పెగడపల్లి మండలం ఐతుపల్లి, నందగిరిలో గ్రామ ఆధ్వర్యంలో పార్టీ జెండాలను ఆవిష్కరించి సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న రమణారావు మాట్లాడుతూ, గత పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమం గురించి ప్రజలకు వివరిస్తూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో జడ్పీటీసి, ఎంపీటీసీ స్థానాలను బీఆర్ఎస్ అభ్యర్ధులే పూర్తి స్థాయిలో గెలుపొందేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేయాలని కోరారు. ప్రజా ప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్ తమ రెండేళ్ల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందన్నారు.
ఈ కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు లోక మల్లారెడ్డి, నంచర్ల సింగిల్ విండో చైర్మన్ మంత్రి వేణుగోపాల్, పార్టీ నాయకులు ఉప్పుగండ్ల సురేందర్ రెడ్డి, గాజుల గంగాధర్, నారెడ్డి రాజిరెడ్డి, మదారపు కరుణాకర్ రావు, తిర్మణి నర్సింహరెడ్డి, ఉమ్మెంతుల భాస్కర్ రెడ్డి, నగావత్ తిరుపతినాయక్, నాగుల రాజశేఖర్ గౌడ్, పలుమారు విజయ్ యాదవ్, గోలి సంజీవరెడ్డి, జానీ పాషా, రహీం, మడిగెల తిరుపతి, భోగ లక్ష్మీనారాయణ, మాల రవి, చందు, తిరుపతి, శ్రీనివాస్, రమేశ్, గంగాధర్, మహేష్, మల్లేశం, బాబు, తదితరులున్నారు.