Baby elephant | కేరళ (Kerala)లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. వయనాడ్ (Wayanad)లోని ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు (school) ఊహించని అతిథి వచ్చి విద్యార్థులను, ఉపాధ్యాయులను ఆశ్చర్యానికి గురిచేసింది.
కెకాడిలోని ప్రభుత్వ ఎల్పీ పాఠశాల ఆవరణలోకి ఓ పిల్ల ఏనుగు (Baby elephant) ప్రవేశించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ పాఠశాలలో వంద మందికిపైగా విద్యార్థులు ఉంటారు. స్కూల్ అడవికి సమీపంలో ఉండటంతో సాయంత్రం వేళల్లో తరచూ ఏనుగుల గుంపులు అటుగా వెళ్తుంటాయని సిబ్బంది తెలిపారు. అయితే, స్కూల్ టైమింగ్స్‌లో ఇలా లోపలికి రావడం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు.
పిల్ల ఏనుగు తమ స్కూల్ ఆవరణలోకి రావడంతో పిల్లలు ఆశ్చర్యానికి గురయ్యారు. మరోవైపు సెక్యూరిటీ కారణాలతో ఉపాధ్యాయులు, సిబ్బంది అప్రమత్తమయ్యారు. పిల్లల్ని తరగతి గదుల్లో ఉంచి తులుపులు వేశారు. దాదాపు గంటసేపు ఆ పిల్ల ఏనుగు పాఠశాల ఆవరణలో చక్కర్లు కొట్టినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తెలిపారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు అక్కడికి వచ్చి పిల్ల ఏనుగును అడవిలోకి వదిలినట్లు చెప్పారు. పిల్ల ఏనుగు స్కూల్ ఆవరణలో చక్కర్లు కొడుతున్న వీడియో ప్రస్తుతం వైరల్ (viral video) అవుతోంది.
Also Read..
Kokilaben Ambani | ఆస్పత్రిలో చేరిన ముకేశ్ అంబానీ తల్లి.. ఆందోళనలో ఫ్యామిలీ
OpenAI | త్వరలో భారత్‌లో ఓపెన్ ఏఐ తొలి ఆఫీస్.. ఉద్యోగ నియామకాలు చేపట్టిన సంస్థ..!
Supreme Court: వీధికుక్కలను స్టెరిలైజ్ చేసి.. రిలీజ్ చేయండి : సుప్రీంకోర్టు