Kokilaben Ambani | ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ (Mukesh Ambani) తల్లి కోకిలాబెన్ అంబానీ ఆస్పత్రిలో చేరారు. శుక్రవారం ఉదయం కోకిలాబెన్ అంబానీ (Kokilaben Ambani) అస్వస్థతకు గురికావడంతో ముంబై (Mumbai)లోని హెచ్ఎన్ రిలయన్స్ ఆస్పత్రికి (HN Reliance Hospital) తరలించారు. ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు జాతీయ మీడియా పేర్కొంది.
అంబానీ కుటుంబ సభ్యులు హుటాహుటిన దక్షిణ ముంబైలోని రిలయన్స్ ఆస్పత్రికి వెళ్తున్న వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అందులో అనిల్ అంబానీ (Anil Ambani), ఆయన భార్య ఓ కారులో వెళ్తుండగా.. ముకేశ్ అంబానీ ఫ్యామిలీ ఫుల్ సెక్యూరిటీతో ఆస్పత్రికి చేరుకుంది. ప్రస్తుతం కోకిలాబెన్ ఆరోగ్య పరిస్థితి గురించి ఎలాంటి సమాచారం లేదు. అయితే, ప్రస్తుతం ఆమె వయసు 91 ఏండ్లు. వయో సంబంధిత సమస్యలతో ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు సమాచారం. దీనిపై అంబానీ కుటుంబం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు. ఆస్పత్రి వర్గాలు కూడా కోకిలాబెన్ ఆరోగ్యం గురించి ఇంకా స్పందించలేదు.
Also Read..
OpenAI | త్వరలో భారత్లో ఓపెన్ ఏఐ తొలి ఆఫీస్.. ఉద్యోగ నియామకాలు చేపట్టిన సంస్థ..!
US visa | అమెరికాలో 5.5 కోట్ల మంది వీసాలను క్షుణ్ణంగా పరిశీల్తిన్న ట్రంప్ యంత్రాంగం
Elvish Yadav | బిగ్బాస్ విన్నర్ ఇంటిపై కాల్పులు.. ఎన్కౌంటర్లో నిందితుడు అరెస్ట్