OpenAI | చాట్‌జీపీటీ (ChatGPT) మాతృసంస్థ ఓపెన్ఏఐ (OpenAI) భారత్‌లో తన కార్యకలాపాలను విస్తరించడంపై ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. ఇందులో భాగంగానే ఇటీవలే ‘చాట్‌జీపీటీ గో’ (ChatGPT Go) పేరుతో సరికొత్త, చవకైన సబ్స్క్రిప్షన్ ప్లాన్‌ను (new subscription plan) ప్రకటించిన విషయం తెలిసిందే. కేవలం రూ.399కే ఈ ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. భారత్‌లో ఓపెన్ ఏఐ టూల్స్‌కు మంచి డిమాండ్ దృష్ట్యా భారత వినియోగదారులకు చవకైన సబ్స్క్రిప్షన్ ప్లాన్‌ను తెచ్చింది. ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌లో తన తొలి ఆఫీస్‌ను ఓపెన్ చేసేందుకు సిద్ధమైనట్లు (OpenAI To Launch First India Office) తెలిసింది.
ఈ ఏడాది చివరికల్లా దేశరాజధాని న్యూ ఢిల్లీ (Delhi)లో కార్యాలయం ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. భారత్‌లో చాట్ జీపీటీ వినియోగం గణనీయంగా పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే ఉద్యోగ నియామకాలు కూడా చేపట్టినట్లు తెలిపాయి. ఈ మేరకు కంపెనీ వర్గాలను ఊటంకిస్తూ ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ నివేదించింది. మరోవైపు భారత్‌లో ఏఐకి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని ఓపెన్ ఏఐ సీఈవో సామ్ ఆల్ట్మాన్ (Sam Altman) అన్నారు. భారత్‌లో తొలి ఆఫీస్‌ను ప్రారంభించి స్థానిక టీమ్‌ను ఏర్పాటు చేయడం, ఆ మిషిన్కు కట్టుబడి భారత్‌లో కృత్రిమ మేధను మరింత అందుబాటులోకి తెస్తామన్న నిబద్ధతకు ఇది తొలి మొట్టు అని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.
Also Read..
Elvish Yadav | బిగ్‌బాస్ విన్నర్ ఇంటిపై కాల్పులు.. ఎన్కౌంటర్లో నిందితుడు అరెస్ట్
Flight On Air | ఎయిర్‌పోర్ట్‌లో పార్కింగ్ కొరత.. గాల్లోనే 20 నిమిషాల్లో చక్కర్లు కొట్టిన విమానం..!