Donald Trump: రాజకీయ హింసకు ముగింపు పలకాలి.. ఛార్లీ కిర్క్‌ను గుర్తు చేసిన ట్రంప్
Donald Trump: కన్జర్వేటివ్ నేత ఛార్లీ కిర్క్ గురించి ట్రంప్ తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఛార్లీ కిర్క్ ఓ గొప్ప వ్యక్తి అని, అమెరికాలో దైవం పట్ల విశ్వాసాన్ని పెంపొందించడంలో ఆయన ఎంతో పాత్ర పోషించినట్లు ట్రంప్ తెలిపారు. రాజకీయ హింసకు ముగింపు పలకాలన్నారు.
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) తన ప్రసంగంలో గత ఏడాది హత్యకు గురైన కన్జర్వేటివ్ నేత ఛార్లీ కిర్క్ గురించి ప్రస్తావించారు. క్యాపిటల్ హిల్‌లో జరిగిన కార్యక్రమంలో ఉభయసభలను ఉద్దేశించి ట్రంప్ ఇవాళ ప్రసంగించారు. తన ప్రసంగంలో ఛార్లీ కిర్క్ భార్య ఎరికా కిర్క్ సేవలను ప్రశంసించారు. ఛార్లీ కిర్క్ ఓ గొప్ప వ్యక్తి అని, అమెరికాలో దైవం పట్ల విశ్వాసాన్ని పెంపొందించడంలో ఛార్లీ ఎంతో పాత్ర పోషించినట్లు ట్రంప్ తెలిపారు. అమెరికాలో తాను అధికారంలో ఉన్న సమయంలో.. మతం, విశ్వాసాలు, క్రైస్తవం, దైవంపై నమ్మకం పెరిగినట్లు చెప్పారు. చాలా తీవ్రమైన స్థాయిలో మత పునరుద్దరణ జరిగినట్లు వెల్లడించారు. యువతలో ఆ ఆసక్తి కనిపించిందని, తన మిత్రుడు ఛార్లీ కిర్క్ ఆ ఉద్యమాన్ని తీసుకువచ్చినట్లు ట్రంప్ చెప్పారు.
చాలా క్రూరమైన రీతిలో ఛార్లీని గత ఏడాది హత్య చేశారని, అతని విశ్వాసాలను దెబ్బతీసే ప్రయత్నం చేసినట్లు ట్రంప్ పేర్కొన్నారు. దైవం సన్నిధిలో అమెరికా అంతా ఒక్కటే అన్న నినాదాన్ని వినిపించాలని, మనం అందరం ఒక్క దగ్గరికి రావాలని, ఎటువంటి రాజకీయ హింసనైనా పూర్తిగా తిరస్కరించాలని ట్రంప్ తన ప్రసంగంలో తెలిపారు. మన దేశం మతాన్ని ప్రేమిస్తుందని, ఆ పునరుద్దరణ ప్రక్రియను కూడా ప్రేమిస్తామని, ఎవరూ ఊహించనిరీతిలో ఆ పునరుద్దరణ జరుగుతోందని, ఇది నిజంగా చాలా అందమైన అంశమని ట్రంప్ అన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

