US visa | వీసాల (US visa) విషయంలో ట్రంప్ (Trump administration) యంత్రాంగం మరింత కఠినంగా వ్యవహరిస్తోంది. ఇందులో భాగంగానే అమెరికాలో ఉన్న దాదాపు 55 మిలియన్ (5.5 కోట్ల మంది) విదేశీయుల వీసా పత్రాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తాజాగా వెల్లడించింది. ఈ మేరకు ట్రంప్ యంత్రాంగం ఓ ప్రకటన విడుదల చేసింది. వీసా ఉల్లంఘనలను గుర్తించే ప్రయత్నంలో భాగంగా ఈ చర్య తీసుకున్నట్లు తెలిపింది.
అమెరికాలో నేరాలు, ఉగ్రవాద చర్యలకు పాల్పడినా, ఉగ్ర సంస్థలకు మద్దతిచ్చినా, వీసా కాల పరిమితిని మించి అమెరికాలో నివసిస్తున్నా, ప్రజాభద్రతకు భంగం కలిగించడం వంటి చర్యలకు పాల్పడిన వారిని స్వదేశాలకు తిప్పి పంపించే చర్యల్లో భాగంగా ఈ కసరత్తు చేస్తున్నట్లు పేర్కొంది. అలాంటి వారి వీసాలను ఎప్పుడైనా రద్దు చేసే అవకాశం ఉందని స్టేట్ డిపార్ట్మెంట్ చెబుతోందని ఓ సీనియర్ పరిపాలన అధికారి తెలిపారు. అమెరికా చట్టాల ఉల్లంఘనలను సైతం సమీక్షిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.
Also Read..
Drake Passage: దక్షిణ అమెరికా డ్రేక్ పాసేజ్లో 7.5 తీవ్రతతో భారీ భూంకపం