US-India Tariffs | వైట్‌హౌస్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో మరోసారి భారత్‌పై తన మాటలతో తీవ్రంగా దాడి చేశారు. భారత్‌ను టారిఫ్ కింగ్‌గా పేర్కొన్నారు. చౌకైన రష్యన్ చమురు ఒప్పందంతో లాభం పొందేందుకు భారత్ ఓ పథకాన్ని అమలు చేస్తుందని ఆరోపించారు. అయితే, ప్రపంచ ఇంధన మార్కెట్‌ను స్థిరంగా ఉంచేందుకు అవసరమైన చర్యలన్నీ తీసుకోవాలని గత కొన్నేళ్లుగా అమెరికా, భారత్ కు చెబుతోందని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను ఒక ఆప్షన్‌గా ఎంచుకోవాలని కూడా అగ్రరాజ్యమే సూచించిందని రష్యా పర్యటనలో వెల్లడించిన విషయం తెలిసిందే. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌కు దగ్గరవుతోందని నవారో పేర్కొన్నారు.
#WATCH | US | White House Trade Adviser Peter Navarro says, “In India, 25% tariffs were put in place because they cheat us on trade. Then 25% because of the Russian oil… In many ways, the road to peace runs through New Delhi…”
He said, “Prior to Russia’s invasion of Ukraine… pic.twitter.com/DxT7oUrpPV
— ANI (@ANI) August 21, 2025
ట్రంప్ భారత ఉత్పత్తులపై సుంకాన్ని 50శాతానికి రెట్టింపు చేసినప్పటి నుంచి భారతదేశం-అమెరికా మధ్య సంబంధాలు దిగజారుతున్నాయని నవారో అమెరికాలో విలేకరులతో సమావేశంలో మాట్లాడారు. 2022లో రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమయ్యే ముందు వరకు భారతదేశం దాదాపుగా రష్యన్ చమురును కొనుగోలు చేయలేదని.. మొత్తం అవసరంలో దాదాపు ఒకశాతం.. కానీ ఇప్పుడు అది 35శాతానికి పెరిగిందన్నారు. ఇంతకు ముందు సైతం నవారో రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడంపై ప్రశ్నలు లేవనెత్తారు. ఇటీవల ఆయన భారత్‌పై విమర్శల దాడి చేయడం ఇది రెండోసారి. మూడురోజుల కిందట ఫైనాన్షియల్ టైమ్స్‌లో చమురు కొనుగోళ్లపై ప్రశ్నించారు.
#WATCH | US | White House Trade Adviser Peter Navarro says, “India doesn’t appear to want to recognise its role in the bloodshed… It’s cosying up to Xi Jinping… They don’t need the (Russian) oil. It’s a refining profiteering scheme. It’s a laundromat for the Kremlin… I love… pic.twitter.com/sDi6jYzp6L
— ANI (@ANI) August 21, 2025
ఇంధన అవసరాలకు రష్యా చమురు అవసరమని భారత్ చేస్తున్న వాదనలు తప్పని.. చౌకైన ముడి చమురును కొనుగోలు చేసి, రిఫైనరీల్లో ప్రాసెస్ చేసి ఆపై యూరప్, ఆఫ్రికా, ఆసియా దేశాల్లో అధిక ధరలకు పెట్రోల్, డీజిల్ ఉత్పత్తులను విక్రయిస్తుందన్నారు. ఇది భారత్‌కు పూర్తిగా లాభదాయకంగా ఉందని.. అమెరికాకు భారతదేశంతో భారీ వాణిజ్య లోటు ఉందని సుంకాల విషయానికి వస్తే భారత్ రాజులాంటిదని అక్కసు వెల్లగక్కారు. భారత్ సుంకాలు అమెరికాతో పాటు కంపెనీలపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్నారు. భారత్‌కు వస్తున్న ఆదాయం రష్యా నుంచి కొనుగోలు చేసే చమురు ద్వారానే వస్తుందని నోరుపారేసుకున్నారు. భారత్ నుంచి వచ్చే ఆదాయంతో రష్యా ఆయుధాలను తయారు చేసి ఉక్రెయిన్‌పై దాడి చేస్తుందని.. అమెరికన్ పన్ను చెల్లింపుదారులు తమ ప్రభుత్వం ద్వారా ఉక్రెయిన్‌కు సహాయం చేసేందుకు మరిన్ని డబ్బు, ఆయుధాలను ఇవ్వాల్సి వచ్చిందన్నారు.