Supreme Court: వీధికుక్కలను స్టెరిలైజ్ చేసి.. రిలీజ్ చేయండి : సుప్రీంకోర్టు
Supreme Court: వీధికుక్కలను స్టెరిలైజ్ చేసి, రిలీజ్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దురుసు కుక్కలను, రేబిస్ ఉన్నవాటిని షెల్టర్లలోనే ఉంచాలని పేర్కొన్నది. బహిరంగ ప్రదేశాల్లో కుక్కలకు ఆహారం పెట్టవద్దు అని కోర్టు చెప్పింది.
న్యూఢిల్లీ: వీధి కుక్కల అంశంలో సుప్రీంకోర్టు(Supreme Court) తన గత తీర్పును సవరించింది. వీధి కుక్కలను స్టెరిలైజ్ చేసి, వాటిని రిలీజ్ చేయాలని ఇవాళ అత్యున్నత న్యాయ స్థానం తన తాజా తీర్పులో ఆదేశించింది. ఢిల్లీలో ఎక్కడ నుంచి తీసుకెళ్లిన కుక్కలను, స్టెరిలైజ్ చేసిన తర్వాత వాటిని అక్కడే వదిలేయాలని కోర్టు తన ఆదేశాల్లో పేర్కొన్నది. వీధి కుక్కలను షెల్టర్లలో వేయడం వల్ల.. ఆ షెల్టర్లు కిక్కిరిసిపోయాయని, దాని వల్ల వీధి కుక్కల ఆరోగ్యం ఆందోళనకరంగా మారినట్లు కోర్టు వెల్లడించింది.
వ్యాక్సినేషన్ తర్వాత కుక్కలను రిలీజ్ చేయాలని సుప్రీంకోర్టు తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. యానిమల్ బర్త్ కంట్రోల్ రూల్స్ను కఠినంగా అమలు చేయాలని కోర్టు పేర్కొన్నది. అయితే దూకుడు ప్రవర్తన ఉన్న కుక్కలను, రేబిస్ వ్యాధితో ఉన్న కుక్కలను పబ్లిక్ స్థలాల్లో వదలవద్దు అని కోర్టు తెలిపింది. అలాంటి కుక్కలను డాగ్ షెల్టర్లలోనే ఉంచాలని కోర్టు ఆదేశించింది. ఆగస్టు 11వ తేదీన ఇచ్చిన తీర్పులో.. వీధికుక్కలను షెల్టర్ హౌజ్లకు తరలించాలని కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.
జస్టిస్ విక్రమ్ నాథ్, సందీప్ మెహతా, ఎన్వీ అంజారియాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం తీర్పును ఇచ్చింది. డీవార్మింగ్, వ్యాక్సినేషన్ తర్వాత వీధి కుక్కలను షెల్టర్ల నుంచి రిలీజ్ చేయాలని ధర్మాసనం తెలిపింది. అయితే బహిరంగ ప్రదేశాల్లో వీధి కుక్కలకు ఆహారాన్ని అందించడం నిషేధించాలని కోర్టు తన తీర్పులో పేర్కొన్నది. వీధి కుక్కలకు ఆహారం అందించేందుకు నిర్దేశిత ప్రదేశాలను ఏర్పాటు చేయాలని కోర్టు తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

