Indiramma Illu | తిమ్మాపూర్, ఆగస్టు 26: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఇందిరానగర్లో ఇం దిరమ్మ ఇండ్ల రెండో విడత ఎంపిక ప్రక్రియ జరుగుతుండగా తన పేరును పరిగణనలోకి తీసుకోవడం లేదని గ్రామానికి చెందిన గండికోట సునీత ఆరోపించింది.
మంగళవారం కార్యదర్శిని అడిగేందుకు వస్తుండగా కాంగ్రె స్ నాయకుడు కలుగజేసుకుని అనారోగ్యంతో ఉన్న తన భర్త కృష్ణను కొట్టాడని ఆరోపించింది. తమ విషయంలో అన్యాయంగా వ్యవహరిస్తున్నారని, న్యాయం చేయాలని గ్రామ పంచాయతీ ఎదుట సాయంత్రం వరకు నిల్చొని కుటుంబంతో సహా వేడుకుంది.