రాజన్న సిరిసిల్ల : తంగళ్ళపల్లి మండలం పద్మనగర్ గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొనడంతో బస్సులోని పలువురు ప్రయాణికులు తీవ్ర గాయాలయ్యాయి. మంగళవారం సాయంత్రం సిద్దిపేట నుండి సిరిసిల్ల వెళ్తున్న ఆర్టీసీ బస్సు, సిరిసిల్ల నుండి హైదరాబాద్ వెళ్తున్న లారీ అతివేగంగా ఒకదానినొకటి ఢీకొన్నాయి.
ఆర్టీసీ బస్సు ముందు భాగం లారీ క్యాబిన్‌ను బలంగా తాకడంతో అద్దాలు పగిలిపోయాయి. ఈప్రమాదంలో బస్సులోని ప్రయాణికులకు తీవ్రగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే అంబులెన్స్‌లో సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.