Raj B Shetty | యాక్టర్‌గా, దర్శకుడిగా, రైటర్‌గా, నిర్మాతగా కన్నడ సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక ఫాలోయింగ్ సంపాదించుకున్న నటుల్లో టాప్‌లో ఉంటాడు రాజ్ బీ శెట్టి. ఈ మల్టీ టాలెంటెడ్ యాక్టర్ నిర్మించిన సు ఫ్రమ్ సో ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఆగస్టు 8న తెలుగులో విడుదల కానుంది. కాగా రాజ్ బీ శెట్టి తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన జర్నీ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్‌ను డైరెక్ట్ చేస్తున్నాడన్న పుకార్లను కొట్టిపారేశాడు రాజ్ బీ శెట్టి. అలాంటి కాంబినేషన్ ఏం లేదని చెప్తూనే తాను ప్రస్తుతం ఓ థ్రిల్లర్ ప్రాజెక్టుపై బిజీగా ఉన్నానని చెప్పాడు. అయితే ఆ ప్రాజెక్ట్ ఏంటనేది మాత్రం సస్పెన్స్‌లో పెట్టేశాడు.
ఇక స్టార్ యాక్టర్లతో (పెద్ద స్టార్లతో) నటించేందుకు ఆసక్తి చూపించకపోవడంపై ప్రశ్నించగా.. అలాంటి స్టార్లతో నటించేటప్పుడు తరచూ షెడ్యూల్స్‌లో విభేదాలు తలెత్తి కష్టాలు పడాల్సి వస్తుందంటూ చెప్పుకొచ్చాడు. ఒకవేళ పెద్ద స్టార్లతో చేయాల్సి వస్తే తాను ఎంతగానో అభిమానించే శివరాజ్‌కుమార్‌తో నటించేందుకు రెడీ అన్నాడు. రాజ్ బీ శెట్టి ప్రస్తుతం 45 సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ ఆగస్టు 15న విడుదల కానుంది.
Megastar Chiranjeevi | సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్‌పై అందుకే స్పందించను : చిరంజీవి
Jurassic World Rebirth | ఓటీటీలోకి వచ్చేసిన ‘జురాసిక్ వరల్డ్ రీబర్త్’.. కానీ వారికి మాత్రమే.!